జిల్లాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు...అమీన్ పూర్ చెరువు 20 ఎకరాలు స్వాధీనం
posted on Sep 3, 2024 @ 2:17PM
హైదరాబాద్ లో చెరువులు, నాలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా ఇపుడు జిల్లాలకు విస్తరించింది. హైడ్రా నోటీసులు అందుకున్నవారిలో వారు వీరు అని కాదు ఎవ్వరినైనా వదిలేది లేదన్నట్టు కమిషనర్ రంగనాథ్ వ్యవహరించారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ కట్టిన ప్రముఖ హీరో నాగార్జున కోర్టు గడప ఎక్కకముందే నిమిషాల వ్యవధిలో నేల మట్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత అన్నయ్య తిరుపతిరెడ్డికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజి చెరువులో కట్టిన ఆధారాలు రావడంతో రంగనాథ్ ఎమ్మెల్యేకు నోటీసులు పంపారు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి దూసుకుపోడంతో ప్రతిపక్షాలు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నాయి. పేదల ఇళ్లు కూలగొట్టడం అన్యాయమని నినదిస్తున్నాయి. భారీ వర్షాలతో హైడ్రా పనులకు విరామం ప్రకటించిన రంగనాథ్ జిల్లాలమీద కాన్సన్ ట్రేట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం పరిరక్షణకు హైడ్రా నడుంబిగించింది. రాజకీయ పలుకుబడితో 20 ఎకరాలను కబ్జా చేసిన వారిపై హైడ్రా ఉక్కు పాదం మోపింది. తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను హైడ్రా ఆదేశించింది. దీంతో ఆక్రమణలు తొలగించిన అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్సర్వే నంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు కబ్జా చేసింది.