ఈ సారి హాలీం గుభాలింపులూ అందవు
posted on Jun 25, 2013 @ 2:35PM
రంజాన్ మాసం దగ్గర పడుతుండటంతో అప్పుడే ఆ సందడి మొదలైంది.. రంజాన్ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది హాలీం.. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసే ఈ హాలీం టేస్ట్ ఈ సారి మరింత కాస్ట్లీ కానుంది.
పెరిగిన ధరలు పండగ సందడి మీద కూడా భారీ ప్రభావం చూపనున్నాయి.. నిత్యావసారలతో పాటు పెరిగిన ఆయిల్, చికెన్, మటన్ రేట్లు ఈసారి హాలీంను సామాన్యుడికి దూరం చేస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్లేట్ 70కి పైగా పలుకుతుండగా ఈ సారి ఆ రేట్ 100 రూపాయలు దాటుతుందంటున్నారు.. డైరెక్ట్‌గానే కాదు ఇండైరెక్ట్‌గా కూడా హాలీం భారం కానుంది.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ట్రాన్స్‌పోర్టేషన్ కూడా భారంగా మారనుంది.
పెరిగిన విధ్యుత్ చార్జీల భారం కూడా హాలీం కనిపించనుంది.. హాలీం సెంటర్లను విధ్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేసే హాటల్ వారు ఆ ఖర్చును కూడా వినియోగదారుడినుంచే వసూలు చేయాలని భావిస్తున్నారు.
ఇలా ఒకటి దానితో ఒకటి కలిసి హాలీం రేటు ప్లేటు 100 రూపాయలను దాటిస్తున్నాయి.. మరి ఇంత రేటుతో ఈ సారి అమ్మకాలు ఎలా ఉండనున్నాయో చూడాలి..