కోహ్లి డాటర్‌కి రే*ప్ వార్నింగ్.. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్..
posted on Nov 11, 2021 @ 11:55AM
వాడో వెదవ. వెదవన్నర వెదవ. ఐఐటీలో చదువుకున్నాడు. అయితేనేం. నీచంగా మాట్లాడాడు. చీప్‌గా వ్యవహరించారు. వాడి పేరు రామ్‌నగేశ్. క్రికెట్ అంటే పిచ్చి. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ తర్వాత ట్విట్టర్‌లో అడ్డమైన కూతలు కూశాడు. 'క్రిక్‌క్రేజీగర్ల్' అనే పేరుతో ఉన్న ట్విటర్ అకౌంట్‌లో విరాట్ కోహ్లీని బెదిరిస్తూ ఓ ట్వీట్ చేశాడు. కోహ్లీ కూతురును అత్యా-చారం చేస్తానంటూ నీచంగా కామెంట్ చేశాడు.
క్షణాల్లో ఆ ట్వీట్ వైరల్ అయింది. నెటిజన్లు ఆ ట్వీట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ట్వీట్ చేసినోడిని ఉరి తీయాలంటూ వేలమంది రీట్వీట్ చేశారు. ట్విటర్ సైతం ఆ ట్వీట్‌ను డిలీజ్ చేసింది. ఢిల్లీ, ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంక్వైరీ చేస్తే.. ఆ ట్వీట్ చేసిన వెదవ హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తెపై అత్యాచారం చేస్తానంటూ ట్విటర్‌లో బెదిరించిన యువకుడిని ముంబయి పోలీసులు సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్)లో అతడు ఉంటున్న క్వార్టర్‌కి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.
రామ్‌నగేష్ తండ్రి ఓడీఎఫ్‌లో ఉద్యోగి. నిందితుడి అరెస్ట్ అనంతరం ఆయన తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. 23 ఏళ్ల రామ్‌నగేష్ హైదరాబాద్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కొంతకాలం ఫుడ్ డెలివరీ యాప్‌లో పనిచేసినట్లు గుర్తించారు.