ఇల్లు అద్దెకు.. అందులో వ్యభిచారం..
posted on Jun 23, 2021 @ 3:53PM
అసలే కరోనా కాలం. అందులోను కలికాలం. కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మనిషికి మనిషి మూడు మీటర్ల దూరం ఉండాలి. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి అని ఒక వైపు నోర్లు పగిలేలా మొత్తుకుంటున్నారు. మరో వైపు ఈ కరోనా ఆర్థికంగా అట్టడుగు ను తొక్కిపడేస్తుంది. చాలా మంది జాబ్ లేక, జీవనాధారం లేక అన్నమో రామచంద్ర అని అంటుంటే కొందరు మాత్రం ఈ క్రిటికల్ పరిస్టిస్తులను కూడా కాసులు చేసుకుంటున్నారు. అద్దెకు ఇల్లు తీసుకుని వ్యభిచారానికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. లాక్ డౌన్ టైం లో తనికీలు కూడా ఎక్కువగా ఉండవనుకుని యధావిధిగా వ్యభిచారాన్ని నడుపుతున్నారు. తాజాగా కొందరు చేయడానికి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న ముఠా కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. యువతుల్ని తీసుకొచ్చి సెక్స్ రాకెట్ నడుపుతోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కేపీహెచ్‌బీ లో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. దీంతో ఓ యువతితో పాటు యువకుల్ని అదుపులోకితీసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీకాలనీ మొదటి ఫేజ్‌లోని ఈడబ్ల్యూఎస్ 702 గృహంలో కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిన్నారు.
గత కొన్ని రోజులుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. అమ్మాయిలను తీసుకురావడం డబ్బులు అవసరం ఉన్నవాళ్ళకి అకామిడేషన్ పాటు అమ్మాయిలను అప్పజెపి డబ్బులు సొమ్ముచేసుకోవడం. కట్ చేస్తే సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడిచేసి ముగ్గురు యువకులను, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి యువకులు సురదామ శీను, రాయగిరి హరిప్రసాద్, సునీల్ జన్నాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.