మరదలి మీద మనసు పారేసుకున్నాడు.. పెళ్లాన్ని చంపేశాడు
posted on Jun 17, 2021 @ 6:29PM
భార్య, భర్తల మధ్య మనస్పర్దలు రావడం సహజం.. సమస్యలు వస్తే సర్దుకుపోవాలిగానీ. ఆ మనస్పర్థలు ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళకూడదు.. ఒక వేళా మ్యాటర్ అక్కడి ఎక్కడివరకు వెళ్లిందంటే అది పెద్ద రీజన్ అయ్యి ఉంటుంది. అతనికి తన మరదలితో ఉండాలనుకున్నాడు..అందుకోసం అతనికి ఒక రీసన్ కనిపింది.. అదే అతని భార్య వేరే వాళ్ళతో చనువుగా ఉండడం ఇక అంతే ఆమెను అడ్డుతొలిగించి మరదలితో కాపురం పెడుదామనుకున్నాడు.. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకి..
భార్య, భర్తల మధ్య మనస్పర్దలు ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిందంటే.. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అక్రమ సంబంధం, రెండు డబ్బు వివాదం..ఒకరి మీద మరొకరికి ప్రేమ తగ్గిందనో వచ్చే మనస్పర్ధలు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. త్వరగానే సమసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే, పూర్వం పెళ్లి అంటే నమ్మకం ఉండేది ప్రస్తుత రోజుల్లో భార్య మీద భర్తకు, భర్త మీద భర్తకు నమ్మకం లేకపోవడం వల్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాని వాళ్లే ఈ అరాచకాలు జరుతున్నాయి. అనుమానం కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారనే భావన ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. అది నిజంగా వివాహేతర సంబంధమని తేలితే ఇద్దరిలో ఒకరు చంపడానికైనా లేదా చవడానికైనా వెనకాడం లేదు ఫ్యాక్షన్ సినిమాలో మర్డర్ సీన్ కంటే దారుణంగా చంపేస్తున్నారు. ఇంకొన్ని ఘటనల్లో తమ వివాహేతర సంబంధాన్ని కంటిస్యూ చేసేందుకు కట్టుకున్న వారినే దారుణంగా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, ఆ కేసు నుంచి తప్పించుకునేందుక నిందితుడు పోలీసులను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. ఏదైనా తట్టుకోవచ్చు గానీ నమ్మకద్రోహం మాత్రం మాత్రం ఏ ఒక్కరు తట్టుకోలేరు.. ఎప్పుడైతే నమ్మకం నదిలో కలిపేస్తామో ఎలాంటి సంఘటనలకు అవకాశాలు ఉంటాయి.. సో అవి భార్య భర్తల మధ్య తలెత్తకుండా ఉండాలంటే నమ్మకాన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి.
వివరాల్లోకివెళితే.. ఢిల్లీకి చెందిన 25ఏళ్ల వికాస్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంకను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అది ఎందుకోసం చేశాడో తెలుసా..? తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకే అతను ఈ దారుణానికి తెగపడ్డాడు . తన భర్త ఇంకొకరితో చనువుగా ఉండటాన్ని భరించలేని ప్రియాంక ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించింది. దానితో పాటు మరదలి తో సంభందం పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు.. అందుకోసమే ఎలాగైన భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న వికాస్ మంగళవారం రాత్రి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసి ఓ కట్టుకథ అల్లాడు. తాను ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి తన భార్యను దారుణంగా పొడిచి చంపారని.. అనంతరం ఎస్కేప్ అయ్యారని పోలీసులకు వివరించాడు. తీరా రంగంలోకి దిగిన పోలీసులు అతను చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి పొంతన లేదని గ్రహించారు. తీరా వారి స్టైల్లో విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.