దానికి నో చెప్పిందని.. భార్యను గన్ తో కాల్చిన భర్త..
posted on May 27, 2021 @ 4:47PM
భార్యాభర్తల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలు నీళ్లలా కనిసి ఉంటారు. ఒకరికి ఒకరు తోడునీడగా, కష్టసుఖాల్లో కలిసి జీవిస్తారు. కానీ, ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల అనుబంధం సూర్యుడు చంద్రుడిల ఎప్పుడు కలవాలి రెండు వ్యతిరేక దిశలుగా ఉంటున్నారు. కలహాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటున్నారు. భార్య భర్తల మధ్య అనుబంధాలు. ప్రేమలు కరువైనాయి. అనుమానాలు, నిత్యం గొడవలు, వివాహేతర సంబంధాల వలన ఎంతోమంది ఆ వివాహబంధానికి తీరని మచ్చ తెస్తున్నారు. పవితమైన బంధానికి దూరమవుతున్నారు. ఇంకా కొంతమంది కుటుంబ కలహాలను భరించలేక వారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడమో, భాగస్వామిని చంపేయడమో చేస్తున్నారు. తాజాగా భార్య సెక్స్ కి ఒప్పుకోలేదని ఆమెను కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపాడో భర్త. అంతేకాకుండా ఆమె మీద ఉన్న కోపంతో పిల్లలను కూడా పొట్టనపెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
అది ఉత్తరప్రదేశ్ లోని బసేది గ్రామం. ఆ గ్రామానికి చెందిన పప్పు అతని వయసు 37 సంవత్సరాలు. తన భార్య డాలీ. ఆమె వయసు 36 సంవత్సరాలు. భార్య భర్తలు కలిసి నివాసముంటున్నాడు. వీరికి సోనియా, వంశ్, హర్షిత అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి డాలీ ముభావంగా ఉంటుంది. ఈ కారణంగానే భర్త ఎన్ని సార్లు అడిగిన ఆమె దగ్గరకు రానివ్వడంలేదు. పప్పు పలుసార్లు శృంగారానికి కావాలని అడిగాడు, ప్రేరేపించాడు. అయినా ఆమె కుదరదంటూ తోసిపుచ్చింది. దీంతో పప్పు ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మరోసారి భార్యను తనతో శృంగారం చేయవల్సిందిగా కోరాడు. అప్పుడు కూడా ఆమె కుదరదు అని చెప్పడంతో ఆమెతో గొడవకు దిగాడు.
నన్నెందుకు దూరం పెడుతున్నావంటూ ప్రశ్నించాడు. భర్త అడిగిన ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. ఈ క్రమంలోనే పప్పు బీరువాలో ఉన్న తుపాకిని తీసి భార్య డాలీని కాల్చాడు. ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. అంతటితో అతడు ఆగలేదు. భార్యపై ఉన్న కోపంతో ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి సమీపంలో ఉన్న ఓ కాల్వలో పడేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతవరకు వారి మృతదేహాలు దొరక్కపోవడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పప్పును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు