కొత్తగా పెళ్లి.. భార్యను గన్ తో కాల్చిన భర్త..
posted on Jun 2, 2021 @ 4:00PM
పెళ్లి ఒక పవిత్రమైన బంధం, అమ్మాయికి ఎన్ని ఆశలు ఉంటాయి, మానెన్నో కోరికలు ఉంటాయి. ఎన్నో ఊహలతో అత్తవారింటికి అడుగుపెడతారు అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలను ఎలా చూసుకోవాలి దిగులుగా ఉన్నపుడు చెల్లిలా, కష్టాల్లో స్నేహితురాలిలా, ఆప్యాయతతో అమ్మగా, దైర్యంలో నాన్న తోడు ఉండాలి ప్రతి భర్త. ఎందుకంటే.. పెళ్లి అంటే ఇంటి పేరుతో మార్చుకోవడం తో పాటు అమ్మానాన్నలకు దూరంగా ఉండాలి. అలవాట్లు మార్చుకోవాలి. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. సర్వస్వం భర్త అని అనుకుంటుంది. తాజాగా ప్రతి అమ్మాయిలాగే కలలు కన్నది సారిక .. భర్త ప్రేమ, అత్తమామల ఆదరణ తో జీవితాంతం సంతోషంగా ఉండాలని కలలు కన్నది. కానీ ఆ కలలు కల్లలు గానే మిగిలిపోయాయి. పెళ్లై ముచ్చటగా మూడు నెలలు తిరగకముందే భర్త చేతిలో హతమైంది. వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కాల్చి చంపాడో కసాయి భర్త.వివరాలలోకి వెళితే..
అది ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ తో గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే సారిక తల్లిదండ్రులు అనుకున్న కట్నం ముట్టచెప్పారు. అయితే వారిచ్చిన కట్నం కుల్దీప్ కి నచ్చలేదు. కుల్దీప్ పెళ్లి వద్దంటూ అయిష్టంగానే ఉన్నాడు. అయినా సరే తల్లిదండ్రుల బలవంతంపై సారిక మెడలో తాళికట్టాడు. వివాహం జరిగిన తర్వాత మూడు నెలల వరకు భార్యతో సక్యతగానే ఉన్నాడు కుల్దీప్. ఆ తర్వాత అతనిలో ఒక రాక్షసుడు నిద్రలేచాడు. ఆ తదుపరి సారికాను వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకాంగాక పుట్టింటికి వెళ్లి రూ. 50 లక్షలు తీసుకురావాలని సారికను వేధిస్తుండేవాడు. ఈ విషయమై పలుమార్లు భార్యపై దాడి చేసేవాడు, విపరీతంగా కొట్టేవాడు, నిత్యం వేధించే వాడు. నిత్యం భార్య భర్తల మధ్య పొయ్యిలో మంట మండినట్లు ఎప్పుడు గొడవ జరిగేది.
ఇక ఈ నేపథ్యంలోనే మంగళవారం భార్యతో గొడవపడి తన లాకర్ లో ఉన్న తుపాకిని తీసుకొని భార్యపై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు రౌండ్లు కాల్చడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. అనంతరం కుల్దీప్, అతని తండ్రి అక్కడినుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.