Read more!

లైఫ్ పార్టనర్ దగ్గర ఈ తప్పులు చేయొద్దు!

ప్రస్తుతకాలంలో వివహబంధాలు చాలా పేలవంగా ఉంటున్నాయి. చిన్న చిన్న వాటికి గొడవ పడటం, ఇగో లు, మిస్ అండర్స్టాండింగ్, అనుమానాలు, ఇంకా ముఖ్యంగా కమర్షియల్ విషయాల్లో ఆర్గ్యు జరగడం,  పర్సనల్ ఇంపార్టెన్స్, పబ్లిక్ సెక్యూరిటీ ఇలా చాలా విషయాలు లైఫ్ పార్టనర్స్ మధ్య గొడవలకు దారి తీసి అవి కాస్తా విడిపోయేవరకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ పార్టనర్ దగ్గర కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్త అజాగ్రత్త అయితే తరువాత చాలా రిలేషన్ కోసం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. 

లైఫ్ పార్టనర్ దగ్గర ఎలా ఉంటే వాళ్ళు ఇంప్రెస్స్ అవుతారు అనే విషయాలు అన్ని చోట్లా ఉంటాయి. వాటిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ లైఫ్ పార్టనర్ దగ్గర చేయకూడని పనులు ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. అవేంటో తెలుసుకుంటే రిలేషన్స్ బ్రేక్ అవ్వడం అంటూ ఉండదు.

ఓపిక ఉండాలి!

ఓపిక ఉండాలనే విషయం అందరికీ తెలిసిందేగా అనుకోవచ్చు. కానీ లైఫ్ పార్టనర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని, తన ప్రోబ్లేమ్స్ ను చెప్పేటప్పుడు ఓపికగా వినాలి. నువ్వెప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు పో….. లాంటి మాటలు మనుషుల మధ్య చాలా దూరాన్ని పెంచేస్తాయి. ప్రతి ఒక్కరికీ తాము ఫేస్ చేసే ప్రాబ్లెమ్ పెద్దగానే కనబడుతుంది కాబట్టి ప్రోబ్లేమ్స్ గురించి చెప్పేటప్పుడు వినడం, చెప్పేసిన తరువాత ఆ ప్రాబ్లెమ్ గురించి అన్ని కోణాలలో కొంచెం వివరించి దాన్ని సాల్వ్ అయ్యేలా సలహా ఇవ్వచ్చు. అలా చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది.

స్పెండింగ్ టైమ్!

కలసి ఉండే సమయం గురించి కొంచెం ఫోకస్ చెయ్యాలి ఇప్పటి జనరేషన్ వారు. ఎంత బిజీ ఉద్యోగం అయినా ఉద్యోగం పనుల్ని ఇంటికి తెచ్చి ఆ పని తాలూకూ ఎఫెక్ట్ ను ఇంట్లో కూడా చూపిస్తూ ఉంటే అన్నిటికంటే ఉద్యోగమే ఎక్కువైపోయింది లాంటి డైలాగ్స్ బాణాల్లా వచ్చేస్తాయి. ఉద్యోగం చేస్తున్నవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూస్తూ పర్సనల్ టైమ్ ను హాయిగా గడపాలి. అప్పుడే ప్రొఫెషన్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను రెండింటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసె జెంటిల్ మెన్ లేదా జెంటిల్ ఉమెన్ అవుతారు.

ఓపెన్ గా ఉండాలి!

కొంతమంది సీక్రెక్స్ మైంటైన్ చేస్తుంటారు. అలాంటి కపుల్స్ మధ్య అపార్థాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి వచ్చినంత తొందరగా తగ్గిపోయేవి కావు. పైపెచ్చు ఒకదానికొకటి ఇంకా అగ్గి రాజుకున్నట్టు పెద్ద గొడవల వైపుకు మల్లుతాయి. కాబట్టి ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఉండటం బెటర్. ఏ విషయం జరిగినా ఇద్దరూ డిస్కస్ చేసుకోవడం, ఏ గొడవ జరిగినా  ఇద్దరూ కలిసి మాట్లాడుకుని దానికి సాల్వ్ చేసుకోవడం బెటర్.

కాంప్రమైజ్!

జీవితమంతా కాంప్రమైజ్ లతోనే గడిచిపోవాలా లాంటి ఆవేశపు క్వశ్చన్స్ వద్దు కానీ నిజానికి చాలా బంధాలు బ్రేక్ అవ్వకుండా నిలబడేట్టు చేసే శక్తి కాంప్రమైజ్ కు ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాబ్లెమ్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే ప్రోబ్లేమ్స్ ను సులువుగానే ఒక కొలిక్కి తీసుకురావచ్చు. 

లోపాలు ఎత్తిచూపద్దు!

లోపమనేది చాలా సహజం. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు లోపాలు ఉన్నవాళ్లు బోలెడు. లోపం అనేది స్వీయతప్పితం కానే కాదు. అలాగని దాన్ని అదేపనిగా ఎవరూ భరించాలని అనుకోరు. కాబట్టి మానసికంగా, శారీరకంగా ఏదైనా లోపం ఉంటే  కోపంలో ఉన్నప్పుడో, వేరే పనుల అసహనంతో ఉన్నప్పుడో, వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడో లైఫ్ పార్టనర్ మీద లోపాన్ని ఎట్టి చూపుతూ మాట్లాడకూడదు. అది చాలా పెద్ద బాధాకరమైన విషయంగా మారుతుంది.

ఎక్స్ప్రెస్ చేయడంలో తగ్గద్దు!

ప్రేమ, ఇష్టం అనేది కామన్. నిజానికి పెళ్లికి ముందు, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు కాలం గడిచేకొద్దీ ఉండదు. 90% జీవితాల్లో ఇలాగే ఉంటుంది. అయితే మనసులో ఇష్టం, ప్రేమ కలిగినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాంటి సంకోచం అక్కర్లేదు. అది కేవలం రొమాన్స్ ఫీలింగ్ వస్తేనే కాదు, ఏదైనా మంచి పని చేసినప్పుడో ప్రాబ్లెమ్ సాల్వ్ చేసే ఐడియా ఇచ్చినప్పుడో, గుర్తుపెట్టుకొని నచ్చిన పని, నచ్చిన వస్తువు, నచ్చిన ఫుడ్, నచ్చిన డ్రెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. నచ్చినవి ఏవైనా తెచ్చినప్పుడు ప్రెసెంట్ చేసినప్పుడు, ప్రేమను, అనురాగాన్ని  వ్యక్తం చేయడంతో తగ్గొద్దు. అలాగే ప్రోబ్లేమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి.

ఇలా ఇవన్నీ ఫాలో అయితే రిలేషన్ బ్రేకప్ అనేది ఉందనే ఉండదు.


                               ◆వెంకటేష్ పువ్వాడ.