రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్
posted on Jan 30, 2024 @ 2:41PM
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ఇరువురి ప్రమాణ స్వీకారానికీ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది.
గవర్నర కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ లను రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురి నియామకానికీ గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో వీరిరువురూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.