ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక
posted on Apr 27, 2020 @ 6:19PM
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పిడుగులు పడే ప్రమాదముందని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం,తర్లుపాడు,అర్ధవీడు,కొనకనమిట్ల, అలాగే నెల్లూరు జిల్లా నెల్లూరు, పొదలకూరు, చేజర్ల, కలువాయ, రాపూర్, బలయపల్లి, వెంకటగిరి, కలువాయి,ఓజిలి,గూడూరు,చిత్తమూరు,సైదాపురం,దక్కలి, చిత్తూరు జిల్లాచిత్తూరు ,శ్రీకాళహస్తీ, తోట్టంబేడు, పాలసముద్రం, గంగాధరనెల్లూరు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.