అసెంబ్లీలో మైక్ విరగ్గోట్టిన హరీష్
posted on Sep 18, 2012 @ 12:48PM
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్‌ఎస్ నాయకులు స్పీకర్ పోడియాన్ని చట్టుముట్టి తెలంగాణా నినాదాలు చేశారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రసంగాన్ని టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జయప్రకాశ్ నారాయణ రాష్ట్రంలో భద్రత లేకపోవటం వల్లే ఐటీ ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారన్నారు. దీంతో సభలో రగడ మొదలైంది. కొంత మంది ఉద్యోగులు వెళ్ళిపోతేనె భాధ పడుతున్నారని, తెలంగాణాకోసం వందలమంది మంది బలయ్యారని టీఆర్‌ఎస్ నాయకులులన్నారు. అయిన జెపి తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేయడంతో, కోపంతో హరీష్ రావు మైక్ విరగ్గొట్టారు. కావాలనే సభను జేపీ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ సభను వాయిదా వేశారు.