పబ్‌లో న్యూడ్ డాన్స్‌లు!.. టాలీవుడ్‌పై పోలీస్ యాక్షన్..
posted on Dec 11, 2021 @ 4:35PM
పబ్‌లంటేనే అరాచకానికి కేరాఫ్‌గా మారుతున్నాయి. అర్థరాత్రి దాటినా మందు, మజా నడిపిస్తున్నారు. కొన్ని పబ్‌లతో డ్రగ్స్ కల్చర్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పోలీసులంటే భయం లేదు. దాడులు చేసినా బెదరడం లేదు. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు.. మరింత దిగజారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్, బేగంపేటలోని టాలీవుడ్ పబ్‌పై పోలీసులు సడెన్‌గా రైడ్ చేశారు. అక్కడి సీన్ చూసి అవాక్కయ్యారు. ఛీ.. వీరు మారరు అంటూ మరోసారి కేసు నమోదు చేశారు. ఇంతకీ, టాలీవుడ్ పబ్‌లో ఏం జరిగింది? పోలీసులు వచ్చే సమయానికి ఏం జరుగుతోంది?
హాఫ్ న్యూడ్ డాన్స్‌లు. అదేదో తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్సులు కావు. హైదరాబాద్ పబ్‌లో అర్థనగ్న నృత్యాలు. పబ్ అంటే మందు తాగడం.. డ్యాన్స్ చేయడం కామనే. కానీ, ఇది మరీ రొటీన్ అనుకున్నారో ఏమో.. బాయ్స్ అండ్ గర్ల్స్.. టాప్‌లెస్ డ్యాన్సులు చేస్తున్నారు. కస్టమర్ల అర్థనగ్న డ్యాన్సులను పబ్ యాజమాన్యామే ఎంకరేజ్ చేస్తోందని అంటున్నారు. అమ్మాయిలకు వెయ్యి రూపాయలు ఇచ్చి.. ఇలా పొట్టి డ్రెస్సులతో.. అసభ్య నృత్యాలు చేసేలా డీల్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది.
బేగంపేటలోని టాలీవుడ్ పబ్‌ను గతంలో లిబ్సన్ పబ్ పేరుతో నిర్వహించారు. పోలీసులు ఓ సారి సీజ్ చేశారు. నోటీసులు కూడా ఇచ్చారు. ఇటీవల పబ్‌కు వచ్చిన దంపతులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు సిబ్బంది దాడికి పాల్పడటంతో లిబ్సన్ పబ్‌ను అర్‌డీఓ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. అయినా, ఆ పబ్ తీరు మారనే లేదు. లేటెస్ట్‌గా లిబ్సన్‌ను టాలీవుడ్ పబ్‌గా పేరు మార్చి మరింత చెలరేగిపోయారు. దీంతో అర్థరాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు టాలీవుడ్ పబ్‌పై మరోసారి సడెన్‌గా దాడి చేశారు. ఇటీవలే కేసు అయింది.. ఇప్పట్లో మళ్లీ పోలీసులు రారని అనుకున్నారో ఏమో.. ఆ సమయంలో పబ్‌లో ఎంజాయ్‌మెంట్ ఓ రేంజ్‌లో నడుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న టాలీవుడ్ పబ్‌లో సమయం దాటిన తరువాత కూడా యువతి యువకులు అర్ధనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఫుల్‌గా తాగి.. ఫుల్ మైకంలో మునిగి.. టాప్‌లెస్‌గా.. హాఫ్ న్యూడ్‌గా.. డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఇలా పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34 మంది యువకులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ పబ్‌పై మరో కేసు నమోదు చేశారు.