ఫామ్‌హౌజ్‌లో కిర్రాక్ పార్టీ.. మస్త్ పోరీలు, పోరగాండ్లు.. కట్ చేస్తే...
posted on Jun 13, 2021 @ 12:13PM
కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు.. ఆటగాళ్లు.. పాటగాళ్లు.. పోటుగాళ్లు.. అంతా ఓ ఫామ్‌హౌజ్‌లో చేరారు.. ఓ బడాబాబు బర్త్‌డే పార్టీని యమ జోష్‌గా జరుపుకున్నారు.. ఒకరు, ఇద్దరు కాదు.. దాదాపు 70మందికిపైగా పోరీలు, పోరగాండ్లు... చూట్టానికి అంతా స్టూడెంట్స్‌లానే ఉన్నారు.. అందరూ రిచ్‌కిడ్స్‌లానే కనిపిస్తున్నారు.. మస్త్ పోష్‌గా రెడీ అయ్యారు.. లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లూ ఇంట్లో బోరింగ్‌గా ఉన్నట్టున్నారు.. ఫామ్‌హౌజ్‌లో బర్త్‌డే పార్టీ అనగానే అంతా రెచ్చిపోయారు.. ఎక్కడెక్కడి నుంచో వాలిపోయారు.. మాంచి హుషారు మీదున్నారు.. ఆ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది వాళ్ల మస్త్ మజా పార్టీ ఏ రేంజ్‌లో జరిగిందో....
అది, రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఓ ఫామ్‌హౌస్... అర్థరాత్రి సమయం.. డీజే సౌండ్లు.. మంచి మంచి బ్రాండ్ల మందు బాటిళ్లు.. రకరకాల నాన్‌వెజ్ ఐటమ్స్... వారెవా.. బర్త్‌డే పార్టీ అంటే అట్లుండాలే.. అనే రేంజ్‌లో జరిగిందా సెలబ్రేషన్... మిడ్‌నైట్.. ఫుల్ మ్యూజిక్‌తో.. ఫుల్‌గా మందేసి.. చిందేసి.. రచ్చ రంబోలా చేశారు వారంతా...
అసలే లాక్‌డౌన్ టైమ్.. ప్రశాంతంగా ఉండే ఫామ్‌హౌజ్‌లో అర్థరాత్రి అంత హంగామా జరుగుతుంటే.. ఆ విషయం బయటకు రాకుండా ఉంటుందా? అలానే జరిగింది.. ఫామ్‌హౌజ్ నుంచి అరుపులు, కేకలు, సౌండ్లతో ఇరిటేట్ అయిన స్థానికులు డయల్ 100కి కాల్ చేశారు.. ఇంకేముంది ఖేల్ ఖతమ్.. బర్త్‌డే పార్టీ బంద్.. తాగింది దిగకముందే ఖాకీలు ఎంట్రీ ఇచ్చారు.. పార్టీ అంతా ఫసక్....
లాక్‌డౌన్‌లో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకున్నారనే కారణంతో ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫామ్‌హౌజ్ నుంచి భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీజేను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.