మెట్రో ప్రయాణీకులకు జాగ్రత్తలు
posted on Sep 3, 2020 @ 11:37AM
కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా ఆగిపోయిన రవాణా వ్యవస్థ ఇప్పుడిప్పుడే కదులుతోంది. అన్ లాక్ 4లో భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లకు ఈనెల 7 నుంచి అనుమతి ఇచ్చారు. అయితే ఈనెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందన మెట్రో ప్రయాణీకులకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం..
- మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి
- సామాజికదూరాన్ని కచ్ఛితంగా పాటించాలి. ఇందుకు అనుగుణంగా స్టేషన్లతో పాటు, రైలు బోగీల్లో కూడా మార్కింగ్ వేస్తారు.
- థర్మల్ స్క్రీనింగ్ తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతిస్తారు.
- ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కొన్ని స్టేషన్లలోనే రైళ్ళు ఆగుతాయి.
- కంటైన్మెంట్ జోన్లలో ఉండే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు.
- స్టేషన్ ఎంట్రన్స్ లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి.
- స్మార్ట్ కార్డ్, ఆన్ లైన్ చెల్లింపులకే ప్రాధాన్యత
- టోకెన్లు, టికెట్లను కూడా సరైన రీతిలో శానిటైజ్ చేయాలి.
- అతి తక్కువ లగేజీని మాత్రమే అనుమతిస్తారు. మెటల్ ఐటెమ్స్ ని అనుమతించరు.