సోనియాతో నరసింహన్ మంతనాలు
posted on Sep 20, 2012 @ 5:59PM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ గురువారం సోనియా గాంధీని కలిశారు. వీరిద్దరి మధ్య రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగి౦ది. తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం . గత రాత్రి గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కాగా జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారిక కార్యక్రమాలపై సీఎం ఢిల్లీ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వివరించాయి. తెలంగాణ సహా, రాష్ట్ర నాయకత్వ మార్పుపై ఏఐసీసీ అగ్రనాయకత్వం ఇటీవల లోతుగా చర్చలు సాగించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.