వచ్చాడండీ.. వయ్యారి గోరంట్ల మాధవ్!
posted on May 28, 2024 @ 2:10PM
జనం మర్చేపోయారు.. వైసీపీ దండుపాళ్యం బ్యాచ్’లో ఈ ‘నగ్న శిఖామణి’ ఒకడు వున్నాడు కదూ.. తన దిశ మొలతో దేశం దశదిశలూ నిర్ఘాంతపోయేలా చేసిన ‘వీడియో స్టార్’ గోరంట్ల మాధవ్ నేనూ ఉన్నానంటూ లైన్లోకి వచ్చేశాడు. ఈయనగారి ముఖం చూసినా ‘ఆ వీడియో’ గుర్తొచ్చే స్థాయిలో పాపులర్ అయిన ఈ అందగాడు ఈ ఎన్నికలలో జగన్ పార్టీకి జాతీయ స్థాయిలో జనం నిర్ఘాంతపోయే స్థాయిలో సీట్లు వస్తాయని చెబుతున్నాడు. కొద్దికాలం క్రితం ఫోన్లో ఈయన వీడియో చూసి జనాలు ఒక పూట భోజనం చేయడం కూడా మానుకున్నారు. అలాంటి పెద్దమనిషి ఇప్పుడు ఫ్యూచర్ చెప్పడానికి బయల్దేరాడు. ఈయనకి మళ్ళీ ఎంపీ టిక్కెట్ వస్తుందో రాదో ఈయనకే తెలియక జగన్ గేటు దగ్గర పడిగాపులు కాసిన గోరంట్ల, జగన్ టిక్కెట్ ఇవ్వను పొమ్మంటే వెర్రి నవ్వు నవ్వుకుంటూ తప్పుకున్న మాధవ్... ఇప్పుడు తనకు అన్నీ తెలిసినట్టుగా బిల్డప్పు ఇస్తున్నాడు. వైసీపీలో అందరూ మళ్ళీ గెలుస్తామని బిల్డప్పు ఇస్తున్నారు కాబట్టి, నేను కూడా ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా తాను కూడా గప్పాలు పలుకుతూ ఆత్మానందం చెందుతున్నాడు. వైసీపీలో వున్న ప్రతి అడ్డమైన వాడికీ ఒక దిక్కుమాలిన ముహూర్తం దొరికింది. ప్రతివాడూ ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం వుంటుందని చెబుతూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరాడు. జూన్ 9న ఉదయం 9 గంటల 35 నిమిషాలకు రుషికొండలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడని కూడా ఈయన చెప్పేస్తున్నాడు. జగన్ మళ్ళీ సీఎం అవుతాడంటూ జోస్యం చెప్పడం కాదు.. రాబోయే రోజుల్లో ఈయనగారి బూతు వీడియో సంగతి మళ్ళీ తవ్వి తీస్తారు.. అప్పుడుంటది అసలు సినిమా.