ట్రావెల్స్ లో.. భారీగా బంగారం పట్టివేత..
posted on Jun 25, 2021 9:26AM
బంగారం ఆ పేరు వింటే కళ్ళు జిగేల్మంటాయి. అది ఆడవాళ్ళకైనా.. మగవాళ్ళకైనా.. లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో సందర్బంగా బంగారం కొని ధరించాలనుకుంటారు. అందుకే ఆ ప్రాణం లేని బంగారానికి అంత ధర.. అయితే ఈ మధ్య కాలంలో బంగారాన్ని సప్లై చేస్తూ చాలా మంది పోలీసుల చేతికి చిక్కుకుంటున్నారు. ఎయిర్ పోర్ట్ లో అయితేనేమి జాతీయ రహదారి లో అయితేనేమి ప్రయాణం ఏదైనా పోలీసులకు పట్టుపడడం కాయం అయిపోతుంది ఈ రోజుల్లో. అయితే ఆ బంగారు స్మగ్లర్స్ కూడా పోలీసుల కంటికి కనిపించకుండా రకరకాలుగా సప్లై చేస్తున్నారు. పండు ముసలికి సంసారం ఎలా చెయ్యాలో నేర్పడం లాంటిదనే చెప్పాలి పోలీసులకు. వాళ్ళ కుప్పి గంతులు పోలీసుల ముందు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని చెప్పాలి. తాజాగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 కేజీల 85 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు కర్నూల్ పోలీసులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎట్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లోకల్,సెబ్ పోలీసులు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు వెళుతున్న AP 39 TG8888 విక్షం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ జైన్ దగ్గర ఈ బంగారం పట్టుబడింది. విలువ సరైన పత్రాలు , ఆధారాలు లేని కారణంగా సదరు బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప, కాగినెల్లి ఎపియస్, ఇంకా సెట్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు పంచ లింగాల రాష్ట్ర సరిహద్దు సిట్ చెక్ పోస్టులో తెల్లవారుజామున చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం చిక్కింది. కాగా, మహావీర్ జైన్ బెంగళూరులోని శివాజీ నగర్ లో ఉన్న అరిహంత్ జ్యువెలరీ షాప్ యజమాని. అతని బ్యాగులో సుమారు 5 కేజీల 85 గ్రామలు (45 బంగారు బిస్కెట్లు , రెండు నెక్లెస్ లు) సోదాల్లో గుర్తించారు . వాటికి సంబంధించి సరైన పత్రాలు , ఎలాంటి ఆధారాలు , ఈ – వే బిల్లులు చూపనందున వాటిని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నందు తదుపరి చర్య నిమిత్తం అప్పగించారు .
ఈ సందర్భంగా కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్ , కర్నూలు తాలుకా ఏవి కంటగిరి రాముడు కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి బంగారం వివరాలు వెల్లడించారు. కాగా, చెక్ పోస్టు దగ్గర చేసిన వాహన తనిఖీలలో సిఐ కంటగిరి రాముడు , ఎస్ఐలు ఖాజా వాలి, లక్ష్మి నారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు