Read more!

జగన్ పాలనపై ‘చిరు’ రాజకీయ విస్ఫోటనం ‘గాడ్ ఫాదర్’?

ఓ వంక చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఉహాగానాలు వినిప్స్తునాయి. మరో వంక త్వరలో ( అక్టోబర్ 5) విడుదల కానున్న చింరజీవి తాజా చిత్రం, ‘గాడ్ ఫాదర్’  ముందస్తు ప్రచారం, (ప్రమోషన్స్) రాజకీయ వేడి పుట్టిస్తోంది. చిరంజీవి నోటి నుంచే వచ్చే పొలిటికల్ డైలాగ్స్, రాజకీయ విస్ఫోటనం సృష్టిస్తాయని అంటున్నారు.  

కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన, మలయాళ చిత్రం 'లూసిఫర్' సినిమాకి రీమేక్’గా తెరకెక్కిస్తున్నఈ చిత్రం కథను చిరంజీవి ఉద్దేశ పూర్వకంగా ఎంచుకున్నారో లేక యాదృచ్ఛికంగా అలా జరిగిందో కానీ, సినిమా కథకు చిరంజీవి పొలిటికల్ బాక్ గ్రౌండ్ కు కొన్ని పోలికలు ఉన్నాయని అంటున్నారు. అందుకే, చిరంజీవి రాజకీయ గతాన్ని, భవిష్యత్ ఉహాలను ‘గాడ్ ఫాదర్’తోముడివేసి సోషల్ మీడియా క్రియేటివ్ రైటర్స్, మానస పుత్రికలుగా  చాలా చాలా కథలు పుట్టుకొస్తున్నాయి.  ఇందులో ఏది నిజమో, ఏది కాదో, కానీ, గాడ్ ఫాదర్ ముచ్చట్లు అయితే  సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి.

నిజానికి, సోషల్ మీడియాలో పురుడు పోసుకున్నచిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ స్టొరీకి, గాడ్ ఫాదర్ కూడా ‘గాడ్ ఫాదర్’ సినిమానే.  చిరంజీవి  పొలిటికల్ రీఎంట్రీ గురించి  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు”అనే  వాయిస్ క్లిప్’ ఈ సినిమాలోని డైలాగే.  అయితే, చిరంజీవీ హీరో టర్న్ డ్ పోలిటిషియన్  టర్న్ డ్ హీరో కావడం వల్ల  సోషల్ మీడియానే కాదు, పొలిటికల్, సినిమా సర్కిల్స్ లోనూ గాడ్ ఫాదర్ కథలు  సంచలనం సృష్టిస్తున్నాయి. 

అదలా ఉంటే, మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న‘గాడ్ ఫాదర్’ చిత్రం కథలో ఏపీ పాలిటిక్స్ ని మిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతోంది. అలాగే, గాడ్ ఫాదర్. చిత్రంలో చిరజీవి డైలాగ్స్ కొన్ని రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతాయని అంటున్నారు. నిజానికి, ఇంకెవరో కాదు స్వయంగా, చిరజీవి  గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే, రొటీన్ తెలుగు సినిమాకు, ముఖ్యంగా చిరంజీవి మార్క్, అమ్మడు .. కుమ్ముడు  టైపు  సినిమాలకు భిన్నంగా  ఉంటుందని అంటున్న ఈ మూవీ సక్సెస్, ప్రధానంగా పొలిటికల్ మసాలా మీదనే ఆధారపడిందనీ, అంటున్నారు, అదే నిజమైతే, గాడ్ ఫాదర్ చిరంజీవి చెప్పినట్లుగా విప్ఫోటనమే అవుతుందని అంటున్నారు. 

గాడ్ ఫాదర్ చిత్రం గురించి జరుగుతున్న చర్చ నిజమే అయితే, ఇందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడేళ్ల సుందర ముదనష్ట పాలనపై, మరీ ముఖ్యంగా, ముఖ్యమంత్రి మూడు రాజధానుల ముతక ఆలోచనపై సెటైర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.అదే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారమే పరమావధిగా అప్పులు చేసి, ఆస్తులు అమ్మి అమలు చేస్తున్న ఉచిత పథకాల గురించి కూడా సరదా సెటైర్లు చాలానే ఉన్నాయని అంటున్నారు.

కథలో అంతర్భాగంగానే, మిడిమిడి రాజకీయ అవగాహనతో, రాజకీయాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న. హీరో కథలు కూడా జత చేసినట్లు చెపుతున్నారు.  అయితే ఇందులో నిజమెంత అనేది సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు. కానీ  జరుగతున్న ప్రచారం నిజమే అయితే మాత్రం, ‘గాడ్ ఫాదర్’ సంచలన చిత్రమే అవుతుంది.  రాష్ట్ర రాజకీయాలపై  సినిమా ప్రభావం ఉంటుందనీ అంటున్నారు. 

 అయితే, నిజానికి, తెలుగు సినిమాకు రాజకీయ వాసనలు కొత్త కాదు. గతంలోనూ ’ఈనాడు’ వంటి రాజకీయ చిత్రాలు అనేకం వచ్చాయి.అలాగే  రక్తకన్నీరు నాగభూషణం, రావు గోపాల రావు నటించిన చిత్రాల్లోనూ రాజకీయ పంచ్ డైలాగులు సంచలనంసృష్టించాయి. అదే  విధంగా నిన్న మొన్న వచ్చిన కశ్మీర్ ఫైల్స్ , సీతా రామం  చిత్రాలు  దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం సృష్టించాయి.  అలాగే, ఈ మధ్య వచ్చిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియా  ‘బాయ్’కాట్’ ప్రచారానికి బలయ్యాయి. ఈ నేపద్యంలో మరో పది రోజుల్లో, అక్టోబర్ 5 ఐదున  విడుదల అవుతున్న,పొలిటికల్ ‘గాడ్ ఫాదర్’ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుందో .. వెండి తెరపై చూద్దాం.