Read more!

రేపే టీ-20 పండ‌గ‌... క్రికెట్ వీరాభిమానులు పారాహుషార్‌!

భార‌త్‌, ఆస్ట్రేలియా టీ-20  మూడు మ్యాచ్‌ల సిరీస్ చెరో ఒక‌టీ గెలిచి స‌మ‌మ‌యంది. ఇక క‌ప్పో, నొప్పో తేల్చే చివ‌రి మ్యాచ్ ఆదివారం(సెప్టెంబ‌ర్ 25) హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. నాగ‌పూర్ మ్యాచ్ వ‌ర్షం, గ్రౌండ్ ఆడ‌టానికి పెద్ద‌గా అనుకూలించ‌క‌పోయింది. అయినా ప్రేక్ష‌కుల‌ను నిరాశ పెట్ట కుం డా మొత్తాన్ని 16 ఓవ‌ర్ల‌కు కుదించి ఆడించారు. అందులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సిక్స్‌ల మోత‌తో భార‌త్ గెలిచింది. అందువ‌ల్ల‌, ఉప్ప‌ల్ మ్యాచ్‌ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే చాలా కాలం త‌ర్వాత ఒక అంత‌ర్జాతీయ మ్యాచ్ మ‌ళ్లీ చూడ్డానికి క్రికెట్ ప్రేమికులు టిక్కెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు. 

ఆదివారం మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు ఏదో సినిమాకు వెళ్లిన‌ట్టు మంచిదుస్తుల్లో వెళ్ల‌డానికి  ధైర్యం చేయ‌కండి. ఎందుకంటే స్టేడియం అంతా మురికి మ‌యంగా ఉంది. కూర్చునే  సీట్లు  చూస్తే వాంతులు వ‌స్తాయి. అలా ఉంది స్టేడియం నిర్వ‌హ‌ణ‌. దీన్ని గురించి ప‌ట్టించుకున్న నాథుడే లేన‌ట్టుగా త‌యార యింది. కేవ‌లం ఇలా అంత‌ర్జాతీయ మ్యాచ్ జ‌రుగుతుందంటేనే స్టేడియం క్లీన్ అండ్ గ్రీన్ కార్య‌క్ర‌మం చేప‌డ‌తారేమో! కానీ ఇప్ప‌టికిప్పుడు స్టేడియం ద‌ర్శించాలంటే మాత్రం చాలా దారుణంగాఉంది. ఈ సీట్ల లో కూచుని మ్యాచ్ చూడాలా? ఎందుకంత ఖ‌ర్మ‌, హాయిగా ఇంట్లో టిఫిన్ చేస్తూ  టీవీలో  చూడ్డ‌మే మేల‌ను కునే ప‌రిస్థితుల్లో ఉంది అక్క‌డి ప‌రిస్థితి. 

టిక్కెట్ల  విక్ర‌యంలో లోపాల కార‌ణంగా అదంతా ర‌సాభాస‌మైంది. ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తామని ఒకసారి, పే టీ ఎంలో అంటూ మరోసారి అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది. టికెట్ల కోసం జింఖానా మైదానా నికి వచ్చిన వారిని అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ప‌లువురు గాయ‌ప‌డ్డారు.  ఇంతా జరిగితే , టికెట్లు దక్కించుకున్నది కొంత మందే. 

ఉప్పల్ స్టేడియం  సామర్థ్యం 39 వేలు. వీటిలో కాంప్లిమెంటరీ టికెట్లు పోగా మిగిలిన వాటిని విక్రయిం చి నట్టు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే.. అమ్మిన టికెట్ల కంటే కాంప్లిమెంటరీగా ఇచ్చిన టికె ట్లే ఎక్కువని నిగ్గు తేల్చారు. టికెట్ల విక్రయాల్లో గందరగోళం నేపథ్యంలో నిన్న మీడియా ముందుకొచ్చిన హెచ్ సీ ఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్.  టికెట్ల విక్రయాల లెక్కలు బహిరంగ పరిచారు. 15వ తేదీన పేటీఎంలో 11,450 సాధారణ టిక్కెట్లు, 4 వేలు కార్పొరేట్‌ టిక్కెట్లు, 23న సికింద్రాబాద్‌ జింఖానా కౌంట ర్లలో 3 వేలు, అదేరోజు ఆన్‌లైన్‌లో 2,100 టిక్కెట్లు విక్రయించినట్టు చెప్పాడు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తంగా విక్రయించినవి 20,550 గా లెక్కతేలింది. మిగిలిన 12,450 టికెట్లు ఏమయ్యా యన్న ప్రశ్నలు వినిపిస్తు న్నాయి.  

ఏదేమ‌యినా, ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్ చూడాల‌నుకునేవారు చేతులూపుకుంటూ వెళ్ల‌కుండా క‌నీసం  వాట‌ర్ బాటిల్స్‌తో పాటు తువ్వాలు, వీల‌యితే బ‌ట్ట‌లు ఉతికే స‌బ్బో వెంట తీసికెళితే మంచిది. క‌నీసం చ‌ర్మవ్యాధి బారిన‌ప‌డ‌కుండా ఉంటారు. మ్యాచ్ ఆనంద‌లో ఇలాంటి ద‌రిద్రాలు అంటకుండా ఉంటాయి.