బీసీజీ, జీఎన్ రావు రిపోర్ట్ ల పై హైకోర్ట్ ఆదేశాలు: విచారణ 23కి వాయిదా.......
posted on Jan 1, 2020 9:20AM
ఏపీ రాజధాని వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు త్వరలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇవ్వనున్న నిపేదికను తమ ముందుంచాలని రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో పూర్తి వివరాలతో వచ్చే జనవరి 21లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హై కోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించేలా ఆదేశించాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 585 ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కోసం తాజాగా మరో రెండు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావు.
ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ వాదనల్లో వినిపించారు. జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదికలు దాఖలు చేసిందని దానిపై గత 27న మంత్రివర్గం చర్చించిందని తెలిపారు. త్వరలో బీసీజీ కమిటీ కూడా నివేదిక ఇవ్వనుందన్నారు. ఈ రెండు కమిటీల నివేదికను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అందువల్ల అనుబంధ పిటిషన్ల పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని వివరించారు. అయితే సీఆర్డీఏ చట్టం రైతుల హక్కులను పరిరక్షిస్తూందని పిటిషనర్ తరపు న్యాయ వాది తెలిపారు.సీఆర్డీఏను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని కానీ ఎలాంటి చట్టబద్ధత లేదని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ రాజధాని అభివృద్ధి పనుల పై ఎలా పునః సమీక్ష జరుపుతోందని ప్రశ్నించినట్లు సమాచారం.
జీఎన్ రావు కమిటీ నివేదిక అమలైతే రాజధాని రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. బీసీజీ ఏర్పాటును ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని దానికి సంబంధించిన జీవో గురించి కూడా ఎవరికీ తెలియదని తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిర్దేశిత కాలం లోపు రైతుల భూముల్ని అభివృద్ధి చేసి ఇస్తామని సీఆర్డీఏ చట్టంలో లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అధికారిక నిర్ణయం వెలువడక ముందే దాఖలైన పిటిషన్లు అపరిపక్వమైన ఉన్న కోర్టు తాము ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తాము పిటిషనర్ వాదనతో విభేదించటం లేదని అలాగే ప్రభుత్వానికి మద్దతుగా వెళ్లడం లేదని స్పష్టం చేసింది.బీసీజీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు,అందుకు సంభందించిన వివరాలను కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేయాలని ఆదేశించింది.
అదే విధంగా రెండు కమిటీల నివేదికలను వచ్చే జనవరి 21వ తేదీలోపు పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖల్యు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది.జీఎన్ రావు కమిటీ సిఫార్సులు సబబేనని రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్ లో తమను ప్రతివాదులుగా చేర్చుకోవాలని అభ్యర్థిస్తూ కడప కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొంత మంది వ్యక్తులు హై కోర్టు లో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. రావు కమిటీ సిఫార్సుల అమలైతే తమ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు. మొత్తం మీద రాజధాని మార్పు అంశం ఒక చోట తీరని అన్యాయం చేస్తే మరోచోట మేలు చేయబోతోందా అనే విషయం వేచి చూడాలి.