నది వంతెనకు .. బాలిక శవం.. అసలు ఏం జరిగింది?
posted on Jul 22, 2021 @ 6:43PM
మనిషికి ఈర్ష్య.. ద్వేషం.. ఈ రెండే మనిషి పతనానికి మూలకారణం.. అవి ఎప్పుడైతే జయిస్తామో మానవ జీవితం సార్ధకతం అవుతుంది.. తాజాగా ఈర్ష్య.. ద్వేషం.. మనిషిని ఎంతలా దిగజార్చాయి చూడండి..పక్కవారికంటే మంచి భోజనం చేసిన.. ఖరీదైన బట్టలు వేసుకుని దర్జగా తిరిగిన ఓర్చుకోలేని సమాజం.. తయారు అయింది.. బయటి వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తయారు అయ్యారు.. చివరికి ఏమైంది అనేది తెలుసుకుందాం..
ఓపెన్ చేస్తే.. ఒక బాలిక శవం ఓ నది వంతెనకు వేలాడుతుంది.. ఒకటి రెండు కాదు కొద్ది గంటల పాటు వేలాడుతుంది.. ఆ శవం స్థానికుల కంట్లో పడింది.. వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఆ విషయాన్నీ పోలీసులకు చేరవేశారు.. పోలీసులు రంగం లోకి దిగారు.. అప్పుడు వాళ్ళ ముందు ఒక ప్రశ్నల ప్రవాహమే పుట్టుకువచ్చింది.. అది సూసైడ్ హా.. లేదా మర్డర్ హా.. మర్డర్ అయితే ఎవరు చేశారు.. సూసైడ్ ఐతే ఎందుకు చేసుకుంది. ఎవరైనా మృతదేహాన్ని నదిలోకి విసిరేయడానికి ప్రయత్నించగా.. వంతెన రైలింగ్‌కు తగిలి మధ్యలో ఇరుక్కుపోయిందా.. లేదా బాలికనే నదిలో దూకబోయి ఎక్కడ ఇరుక్కుపోయిందా? అనే ప్రశ్నలు పోలీసులను వెంటాడాయి.. అయితే, చివరికి బాలికను ఎందుకు చంపారనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇదే సమయంలో పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్టు మరో వీడియోలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. వలస కార్మికుడైన మృతురాలి తండ్రి పంజాబ్‌లో ఉంటున్నాడు. బాలిక, ఆమె తల్లి ఇటీవలే లూధియానా నుంచి డియోరియాలోని తమ స్వగ్రామానికి వచ్చారు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బాలిక జీన్స్ వేసుకోవడం, ఖరీదైన దుస్తువులు ధరించడం.. ఆమెకు నచ్చిన ఫుడ్ తినడం పట్ల తాత, కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశాడు. చాలా సంవత్సరాలు పట్టణంలో ఉండటం వల్ల బాలిక సంప్రదాయ దుస్తులు ధరించడానికి ఇష్టపడలేదు. దీని వారికి నచ్చలేదు. ‘ఈ వ్యక్తులు తరుచూ అమ్మాయి, ఆమె కుటుంబం జీవనశైలి గురించి వ్యతిరేకిస్తుంటారు.. వారు తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకూ ప్రతీ అంశంపై అసూయ వెళ్లగక్కుతారు.. ఆ విషయం ఆ అమ్మాయికి చాలా సార్లు చెప్పి చూశారు. అయినా ఆ అమ్మాయిలో మార్పు రాకకోపడంతో చివరికి ఆ బాలిక తలపై రాడ్‌తో కొట్టడం వల్ల ఆమె తీవ్రంగా గాయపడింది.. ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని తల్లికి చెప్పారు.. కానీ, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మార్గమధ్యలో వంతెనపై నుంచి నదిలోకి పడేశారు’ అని బాలిక పిన్ని తెలిపింది.
ఈ ఘటనపై డియోరియా పోలీస్ అధికారి శ్రీపతి మిశ్రా మాట్లాడుతూ.. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘‘అమ్మాయి తన తాతతో వాగ్వాదానికి దిగి అతడిని దూషించింది.. దీంతో అమ్మాయి ముగ్గురు బాబాయిలు ఆమెపై దాడి చేయడంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది.. బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలోనే చనిపోయింది... మృతదేహాన్ని నదిలో విసిరేయడానికి ప్రయత్నించారు... కానీ వంతెన రైలింగ్‌కు తగిలి చిక్కుకుంది’’ అని మిశ్రా అన్నారు.
బాలిక తాత హస్నైన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు కోసం గాలిస్తున్నారు. తర్వలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హస్నైన్ ఆటో నడుపుతుంటాడని పోలీసులు పేర్కొన్నారు.
సమాజం ఎంతలా తయారు అయిందంటే.. ఇంట్లో ఉన్న ప్రతి మనిషి వాళ్ళ ఇష్టాలను వదిలేసి బతకాలంటే చాలా కష్టం కదా.. అలాగే మన దేశంలో కూడా ఇలాంటి సంస్కృతి మెల్లి మెల్లిగా వెలుగులోకి వస్తుంది.. కొంత మంది తినే ఆహారం పై.. వాళ్ళు బతికే జీవన విధానంపై ఇప్పటికే కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.. వాళ్లకు నచ్చినట్లు బతకాలంటూ ఆంక్షలు కోరుకుంటున్నారు.. ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి.ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.