గ్యాంగ్ రేప్ చేసిన సైనికులు
posted on Dec 29, 2015 8:44AM
సైనికులు దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సంగతి ఏమోగానీ, అప్పుడప్పుడు కొంతమంది సైనికులు అత్యాచారాలకు పాల్పడుతూ కళంకం తెస్తున్నారు. ఇంట్లోంచి పారిపోయి రైలెక్కిన ఓ యువతిని ఆ రైల్లో ఉన్న సైనికులు గ్యాంగ్ రేప్ చేశారు. హౌరా- అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమార్తె రైలు ఎక్కి పారిపోతోందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. రాంచీ సమీపంలోని మధుపూర్ రైల్వే స్టేషన్లో రైలును ఆపి ఆ అమ్మాయి కోసం గాలించారు. ఇందులో భాగంగా సైనికుల బోగీలోకి రైల్వే పోలీసులు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు సైనికులు తీవ్రంగా వ్యతిరేకించారు. బలవంతంగా లోపలకు వెళ్ళిన పోలీసులకు సైనికుల బోగీలో రేప్‌కి గురై వున్న ఆ యువతి కనిపించింది. ఆ తర్వాత ఆ యువతి ముగ్గురు జవాన్లు తనతో బలవంతంగా మద్యం తాగించి రేప్ చేశారని తెలిపింది. సీసీటీవీ ఫుటేజిలో ఆ ఇద్దరినీ ఆమె గుర్తించింది. ఈ కేసులో నిందితులుగా వున్న సైనికులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో వున్నారు.