జగన్ లో పీక్స్ కి చేరిన ఫ్రస్ట్రేషన్.. పదవుల నుంచి తొలగిస్తానంటూ మంత్రులకు వార్నింగ్
posted on Sep 7, 2022 @ 10:56PM
సొంత పార్టీలోనే తనకు మద్దతు కరవైందని జగన్ భావిస్తున్నారా? అంటే ఆయన మాటలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తున్నది. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ లో ఏం చర్చించారు. ఏం నిర్ణయాలు తీసుకున్నారు అన్నది పక్కన పెడితే.. కేబినెట్ భేటీ తరువాత జగన్ తన మంత్రి వర్గ సహచరులతో మాట్లాడిన మాటలు ఆయన ఎంత ఫస్ట్రేషన్ లో ఉన్నారన్నది తేటతెల్లం చేసింది.
కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు ఎవరూ తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తన సతీమణి భారతిపై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. తన సతీమణిపై విపక్ష నేతల ఆరోపణలను ఎవరూ దీటుగా ఖండించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష విమర్శలకు ఎప్పటికప్పుడు దీటుగా బదులివ్వాలని విస్పష్ట ఆదేశాలిచ్చారు. అలా చేయని మంత్రులను మార్చేస్తాను, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వనని హెచ్చరించారు. కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో మాట్లాడిన జగన్ ప్రధానంగా తన సతీమణి భారతిపై లిక్కర్ స్కాం విషయంలో విపక్షాలు చేసిన ఆరోపణలనే ప్రధానంగా ప్రస్తావించారు.
తెలుగుదేశం విమర్శలను, ఆరోపణలను తిప్పి కొట్టే విషయంలో ఎవరూ సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంతో తానొక్కడినే పోరాడుతున్నాననీ, ఎవరూ పట్టించుకోవడం లేదనీ నిష్టూరమాడారు. ఇక ముందు ఇలా జరిగితే సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రులను మార్చేయడానికి కూడా వెనుకాడనని విస్పష్ట హెచ్చరిక చేశారు. ఒక్క విపక్షంపైనే కాదు.. వైసీపీ ప్రభుత్వానికీ, పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే మీడియా మీద కూడా ఎదురుదాడికి దిగాలని స్వయంగా జగన్ తన కేబినెట్ సహచరులకు పిలుపు నిచ్చారు.
జగన్ మంత్రులకు తీసుకున్న క్లాస్ ప్రభావమో ఏమో కానీ ముఖ్యమంత్రి సతీమణిపై విమర్శలేమిటంటూ బొత్స మీడియా ముందు విపక్షాలపై విమర్శలు చేశారు. అయినా జగన్ క్లాస్ తీసుకున్నారని కాదు కానీ ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు చాలా వరకూ సైలెంటైపోయారని పరిశీలకులు సైతం అంటున్నారు. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం, ఆఖరికి జగన్ సభలకు కూడా జనం హాజరు తక్కువైపోవడం ఆ వచ్చిన వారిలో కూడా చాలా మంది జగన్ ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోవడం వంటి సంఘటనలతో వైసీపీ నేతలు చాలా వరకూ సైలంట్ అయిపోయారు.
మరీ ముఖ్యంగా గడపగడపకూ మన ప్రభుత్వంలో ఎదురైన నిరసన సెగలకు మంత్రులు కూడా చాలా వరకూ విపక్షంపై విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్న పరిస్థితి. అదీ కాక జగన్ దృష్టిలో పడాలంటే మామూలుగా విపక్ష నేతలను విమర్శిస్తే సరిపోదు. విమర్శల తీవ్రత బూతుల స్థాయిలో ఉండాలి. అందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ మంత్రి వర్గ సహచరులతో భేటీలో అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి పోతుల సునీత లాంటి వాళ్లు.. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను బండబూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టినా వాటిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఇక మహిళా మంత్రులు రోజా, అనిత, విడదల రజనీ లాంటి వాళ్లు జగన్ సతీమణి భారతిపై విపక్షం విమర్శలపై పెద్దగా స్పందించలేదు. ద్దగా స్పందించలేదు. మంత్రోరులు జా, అనిత విదేశీ టూర్‌లో ఉన్నారు. వారిరువురిలో రోజా అయితే కేబినెట్ మీటింగ్ సమయానికి వచ్చారు. విడదల రజనీ విషయానికి వస్తే సోషల్ మీడియాలో తన గురించి ప్రచారం చేసుకోవడం మినహా టీడీపీపై విమర్శలు చేయడానికి అస్సలు ముందుకు రారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.