5 కిలోల బియ్యం, కేజి పప్పు పరిస్థితి ఏంటి?
posted on Apr 18, 2020 @ 11:03AM
మొదటి లాక్ డౌన్ పీరియడ్ మార్చి 22 నుండి ఏప్రిల్ 15 వరకు రాష్ట్ర ఆర్థిక సాయం 1500 రూ. 12 కిలోల బియ్యం. మొదటి విడతలో ఇచ్చిన రేషన్ లో కేంద్రం, రాష్ట్రం కలిపి ఇచ్చే వాటా 17 కిలోల బియ్యం మరియు కేజీ పప్పు. కేవలం 12కిలోల బియ్యం మాత్రమే లబ్ధి దారులకు అందాయి మరి మిగతా 5కిలోల బియ్యం, కేజి పప్పు పరిస్థితి ఏంటి? ఇవి ఎవరూ ఇవ్వాలీ కేంద్రమా, రాష్ట్రమా? ఎప్పుడు ఇస్తారు?
మరి రెండవ విడత లాక్ డౌన్ ఏప్రిల్ 16 నుండి మే 1 వరకు ప్రకటించారు. మళ్లీ లాక్‌డౌన్ సందర్భంగా ఆర్థిక సాయం 1500 రూ, 12 కిలోల బియ్యం రాష్ట్రం ఇస్తుందా లేదా?
అర్హులైన అందరినీ ఆహార భద్రత కిందికి ఎందుకు తీసుకురావడం లేదు? 2013 లో PDS ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 70%,పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేశారు. అనగా 100 మందిలో 67 మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు.
2011 సం. లో దేశ జనాభా 121 కోట్లు,ఇప్పుడు 2020 సం. లో దేశ జనాభా 137 కోట్లు. ఇంచుమించు 16 కోట్ల జనాభా పెరిగింది.దాదాపు 80 కోట్ల జనాభాకు ఆహార భద్రత కార్డులు ఇవ్వడం జరిగింది.
ప్రతి 10 సం. ఒక సారి సెన్సెక్స్ జరుగుతుంది.అంటే 2021 సం. లో జరగాలి.కరోన విపత్తు నేపథ్యంలో పెరిగిన జనాభా దృష్ట్యా ఇప్పుడు వారందరికీ ఆహార భద్రత కార్డులు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా 9 నుంచి 10 కోట్ల జనాభాకు రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాలి. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో దాదాపు 20 లక్షల రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాలి. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు 16 నుంచి 18 లక్షల మంది ఉన్నారు.