కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
posted on Jan 27, 2024 @ 10:59AM
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాడు చేశారు. ఈ మెడికల్ క్యాంపుకు భారీ స్పందన లభించింది.
ఈ వైద్య శిబిరంలో ఉచితంగా కంటి,గుండె, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్, తెలుగు యువత నాయకుడు కాండ్రేకుల రవీంద్ర ప్రారంభించారు. ఈ మెగా మెడికల్ క్యాంపునకు పెద్ద ఎత్తున పేదలు తరలి వస్తున్నారు.
ఉచితంగా గుండె, క్యాన్సర్ స్క్రీనింగ్, నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పత్తి నాగేశ్వరరావు, ఎద్దు పార్టీ రామయ్య, కేఎస్ఆర్ ఆర్ శర్మ, పీవీ సుబ్బయ్య, సురభి బాలు, రాంబాబు, యువి శివాజీ ,పల్లె కిరణ, ఆదిత్యా కిరణ్, పెద్ది సతీష్, ముదిగొండ శివ, గుండు సుధా, కామా దేవరాజ్, పితాని పద్మ, మొవ్వ విజయ, వల్లభనేని ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు