దేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
posted on Mar 1, 2024 @ 2:34PM
ఎపిలో వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేసింది. అనపర్తి రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కాస్తా ప్రమాణాల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనేది టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణ చేశారు. తన దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్న రామకృష్ణారెడ్డి.. ఇవాళ నిరూపించేందుకు సిద్ధమయ్యారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కూడా సై అన్నారు. నడిచి వస్తావో హెలికాప్టర్ ఎక్కి వస్తావో.. వేదిక సిద్ధమంటూ ప్రకటించారు. రామకృష్ణారెడ్డి రాకపోతే ఆధారాలు నిరూపించలేకపోయినట్లే అన్నారు. అయితే తన సవాల్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమైన రామకృష్ణారెడ్డిని పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనను కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.