ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు విడదల రజని
posted on Feb 11, 2025 8:41AM
మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధించారంటూ కోటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో విడదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలసిందే. ఈ కేసులోనే ముందస్తు బెయిలు కోసం విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. రజనీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం (ఫిబ్రవరి 11) విచారణ జరగనుంది.
సైబరాబాద్ మొక్క విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసు స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పై హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరి పేట పోలీసులు మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో విడదల రజినీ ఆదేశాల మేరకు తనను వేధించారని పేర్కొంటూ తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. పిల్లి కోటి పిటిషన్ న పరిశీలించి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో చిలకలూరి పేట పోలీసులు విడదల రజినీపై కేసు నమోదు చేశారు. విడదల రజినీతో పాటు ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణి సహా అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు అయ్యింది. 2019లో చిలకలూరి పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురి చేశారనీ, అప్పట్లో దీని పై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పిల్లి తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విడదల రజనీపై కేసు నమోదైంది. ఆ కేసులోనే ముందస్తు బెయిలు కోసం విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు.