ముమ్మరంగా వరద సహాయక చర్యలు
posted on Sep 1, 2024 @ 8:44PM
ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద సహాయక కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్నారు.
• కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.
• వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చ.
• 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ.
• ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది
• ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు..ఇవన్నీ రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని తెలిపిన హోం సెక్రటరీ.
• మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ.
• వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ.
• సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ. రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు.
• విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష.
• పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్‌లు.. అన్ని ప్రాంతాల నుంచి వెంటనే తెప్పించాలన్న చంద్రబాబు.
• లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్న సీఎం.
• అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని ఆదేశం.
• సహాయక చర్యలు వేగవంతం కావాలని ఆదేశం.
• వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి తరలించాలని ఆదేశం.
• అన్ని షాప్‌ల నుంచి వాటర్ బాటిల్స్, బిస్కట్లు, పాలు తెప్పిస్తు్న్నారు.
• ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందించడం లక్ష్యం.
• ఖర్చు గురించి ఆలోచించకుండా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
• అప్పగించిన బాధ్యతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం.