విమానం టాయ్‌లెట్‌లో రెండు కిలోల బంగారం!
posted on May 9, 2014 @ 2:21PM
విమానం టాయ్‌లెట్‌లో రెండు కిలోల బంగారం దొరికింది. ఇది ఎక్కడో ఏ ఫారిన్‌లోనే కాదు.. మన ఇండియాలోనే.. కేరళలోని కొరిప్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. షార్జా నుంచి కాలికట్ వెళ్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్ టాయ్‌లెట్‌కి వెళ్ళినప్పుడు టాయ్‌లెట్‌లో ఎవరో ప్రయాణికుడు దాచిన రెండు కిలోల బంగారాన్ని గమనించింది. ఆమె వెంటనే ఈ విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్ళింది. విమానాన్ని దించడానికి ముందే పైలెట్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. అయితే అరవై లక్షల విలువైన ఆ బంగారం మాది అని ప్రయాణికులలో ఎవరూ ముందుకు రాలేదు. అలా వస్తే అరెస్టు చేయాలని ఎయిర్ పోర్ట్ అధికారులు వెయిట్ చేశారు. అయితే ఎవరూ సదరు బంగారాన్ని క్లెయిమ్ చేయకపోవడంతో ఆ రెండు కిలోల బంగారం ప్రస్తుతం కస్టమ్స్ అధికారుల దగ్గరే వుంది.