మత్య్సకారులుకు బయోమెట్రిక్ కార్డులు
posted on Mar 1, 2012 @ 12:20PM
సముద్ర తీరంవెంట పెరిగిన ప్రభుత్వ నిఘా
విశాఖపట్నం: సముద్రతీరంలో ప్రభుత్వం నిఘా పెంచింది. తీరం ద్వారా దేశంలోకి తీవ్రవాదులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించిన నేపధ్యంలో ప్రభుత్వం తీర ప్రాంతాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. తీరంలో తీవ్రవాదులు చొరబడకుండా ముందుస్తు చర్యలకు దిగింది. గుర్తింపు లేకుండా తీరంలో సంచరించే వ్యక్తులపై నిఘా పెట్టింది. ఇందులో భాగంగా సముద్రతీరం వెంట జీవనం సాగిస్తున్న మత్య్సకారులందరికీ బయోమెట్రిక్ కార్డులు అందజేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్య్సకారుడికి బయోమెట్రిక్ కార్డులు ఇస్తారు. ఈ కార్డులో మత్య్సకారుల పేరు, వయస్సు, చేతివేలి ముద్రలు, చిరునామా ఉంటాయి. వేటసాగించే సమయంలో భద్రతా సిబ్బందివలన ఎదురయ్యే ఇబ్బందులు ఈ కార్డులవల్ల మత్య్సకారులకు తొలగిపోతాయి. గస్తీ సిబ్బంది బయోమెట్రిక్ కార్డు ఉంటేనే మత్య్సకారులకు చేపల వేటకు అనుమతిస్తారు. సముద్ర దొంగలు ఇతర రాష్ర్టాలనుంచి అక్రమంగా మన సముద్ర జలాల్లో ప్రవేశించే వారినుంచి రక్షణ పొందేందుకు ఈ గుర్తింపు కార్డులు ఉపయోగకరంగా మారనున్నాయి.