చంద్రబాబు కేబినెట్ లో తొలి సారి ఎమ్మెల్యేలు పది మంది
posted on Jun 12, 2024 9:16AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కేబినెట్ లో తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మందికి స్థానం కల్పించారు. వీరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు.
అలాగే ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకున్న వారిలె మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ వనిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు.
అలాగే గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి తొలి సారిగా చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకున్న వారిలో పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయులు, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు.