ఎపి ప్లాంట్ నుండి హీరో మోటార్స్ తొలి బైక్ విడుదల... అభినందించిన బాబు
posted on Dec 26, 2019 @ 10:22AM
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్స్ నుండి తొలి బైక్ ను ఆ సంస్థ విడుదల చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయం లో ఎంతో పోటీని తట్టుకొని ఏపీలో ఏర్పాటు చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ నుండి తొలి బైక్ రిలీజ్ చేసిన సందర్బంగా ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హీరో సంస్థ సిబ్బందికి అభినందనలు తెలిపారు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తీసుకొచ్చిన మొట్ట మొదటి భారీ సంస్థ హీరో మోటార్స్ అని అయన తెలిపారు. తాను అప్పుడు చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు ఇప్పుడు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. నవ్యాంధ్ర ను ఆటోమొబైల్ రంగానికి చిరునామాగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో భాగంగా పక్క రాష్ట్రాలనుండి ఎంతో పోటీని తట్టుకుని హీరో మోటోకార్ప్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చామని చంద్రబాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు.