తన్నుకుని తలకలు పోసుకున్న వైసీపీ ఏజెంట్లు!

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు వర్గాల వారు తన్నుకుని తలకలు పోసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాల వారు అంటే వైసీపీ, టీడీపీ వర్గాల వారు అనుకోకండి.. పోలింగ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం.. వైసీపీకి రెండు వర్గాల వారు తన్నుకున్నారు. ఎక్కడైనా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల వర్గాలు ఘర్షణ పడతాయి. అదేంటో నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకులే తన్నుకున్నారు. వైసీపీకి చెందిన రెండు వర్గాల వారు పోలింగ్ బూత్‌లో మా వర్గం వారే ఏజంట్‌గా వుండాలంటే, మావర్గం వారే ఏజెంట్‌గా వుండాలంటూ తన్నుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల వారినీ నాలుగు పీకి కంట్రోల్ చేశారు.

Teluguone gnews banner