ఎట్టకేలకు ‘ఎఫ్ డి ఐ’ లో యూపిఏ విజయం

 

 

 

 

చిల్లర వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పార్లమెంట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. నిన్న రాజ్య సభలో జరిగిన ఓటింగ్లో 123-102 ఓట్ల తేడాతో ఈ అంశానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ఓటింగ్ లో గెలుపొందడానికి యూపిఏ నేతలు తెర వెనుక రాజకీయాలు బాగానే చేయాల్సి వచ్చింది.

 

ములాయం, మాయావతి ప్రభుత్వానికి సహకరించడం, 21 ఓట్ల తేడాతో గెలుపొందడంతో అధికార పక్ష నేతలు ఊపిరిపీల్చుకున్నారు. దీనితో ఎఫ్ డి ఐ లకు వ్యతిరేకంగా అన్నాడిఎంకే ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయినట్లయింది. మొత్తం 19 మంది సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు.

 

ములాయం పార్టీ సభ్యులు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ముగ్గురు తెలుగు దేశం పార్టీ సభ్యులు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సభ లో యూపిఏ కు 94 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఓటింగ్ కు 19 మంది సభ్యులు హాజరు కాలేదు. 17 మంది సభ్యులు కలిగి ఉన్న మాయావతి పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న నేదురుమల్లి జనార్ధన రెడ్డి, స్త్రేచేర్ ఫై వచ్చి ఓటు వేసారు.

 

నిన్న రాజ్య సభలో ఎఫ్ డి ఐ ఓట్ల లెక్కింపు సమయంలో కాస్త గందరగోళం చోటుచేసుకొంది. రాజ్య సభ అధికారులు ఓట్ల లెక్కింపును సరిగా చేయక పోవడమే ఇందుకు కారణం. ఈ తీర్మానానికి అనుకూలంగా 109 ఓట్లు, వ్యతిరేకంగా 123 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. ఈ గణాంకాలను సభ లో ఉన్న సభ్యుల సంఖ్యతో పోల్చిచూస్తే, లెక్క సరిగా లేనట్లు గుర్తించారు. దీనితో, రెండో సారి లెక్కింపును చేపట్టాల్సి వచ్చింది. ఈ దఫా లెక్కింపులో ప్రభుత్వానికి అనుకూలంగా 123 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. దీనితో ప్రభుత్వం గట్టెక్కింది.

Teluguone gnews banner