కూతురికి గర్భం చేసిన తండ్రి..
posted on Jul 15, 2021 @ 2:05PM
చేతి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సిన నాన్న.. తన పిల్లలకు ఏదైనా అయితే గడ్డ తన పిల్లను కాపాడినట్లు సమాజం నుండి చుట్టూ ఉన్న జనాల నుండి తన పిల్లలను కాపాడుకోవాల్సిన నాన్న. బాధ్యతగా కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. తన కూతురిపై కన్నేశాడు. అంతే కాదు 15 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచాడు.. చివరికి గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ఎక్కడో ఉత్తర భారత దేశంలో జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.
ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా ఇల్లు నిర్మించుకకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లి గ్రామానికి వెళ్లింది. ఎప్పడి నుండి కన్నేశాడా తెలీదు.. అదే సమయం అనుకుని మద్యం మత్తులో ఉన్న ఆ నీచపు తండ్రి.. ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక అరిచింది.. గోల చేసింది.. అయినా వినిపించుకోలేదు ఆ ప్రబుద్దుడు.. చివరికి గద్ద వచ్చిన కోడిపిల్లను తన్నినట్లు ఐయింది ఆ బాలిక..
అప్పటి ఆగలేదు.. మందు తాగి తప్పుచేసిన వాడు ఐతే ఆ మందు గిడగానే తన తప్పును తెలుసుకుని పాశ్చతప్పడుతాడు.. వాడి ఎప్పటి నుండో తన మనసులో ఆ బాలికను అనుభవించాలని అనుకున్నాడు కాబట్టి అక్కడితో ఆగక పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటికు చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ కసాయి తండ్రి బెదిరించేవాడు. తండ్రి నిజంగానే కసాయి వాడని తెలిసి ఎంతకైనా తెగిస్తాడని తెలిసి ఆ బాలిక నోరు తెరవలేదు. ఈ క్రమంలో తండ్రి తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్ చేసింది. పోలీసులు వెళ్లి తండ్రిని మందలించారు. ఆ తరువాత బాలిక తాత ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కన ఎవరూ లేకపోవడంతో.. ఇంతకాలం బాలిక తండ్రికి భయపడి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.