కూతురి పై తండ్రి అఘాయిత్యం.. కూతురు చివరికి..
posted on Jul 21, 2021 @ 10:35AM
నేటి సమాజంలో మానవత్వం కరువైంది. ఆడపిల్లల జీవితాలు అంటే అంగట్లో సరుకుల చూస్తున్నారు. రోజురోజుకి ఆడవాళ్లపై దారుణాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ మహిళలకు భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
అది నెల్లూరు జిల్లా. వెంకటగిరి.లో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14ఏళ్ల కుమార్తెపై 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య అనే వ్యక్తి తన భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత మరో వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళకు కొడుకు, కూతురు ఉన్నారు. ఆ మహిళ అంజయ్యతో కలిసి ఉంటోంది. కాగా, కామంతో కళ్ళు మూసుకుపోయిన అంజయ్య ఆమె కూతురిపైనా కన్నేశాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలనుకున్నాడు. అతని పథకం ప్రకారమే గత 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు.
ఇది గమనించిన పదేళ్ల కొడుకు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. దీంతో అంజయ్య అక్కడి నుంచి పారిపోయాడు. స్థానిక మహిళా సంఘం నేతలు, అధికారులు, వలంటీర్ల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంజయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాగితే తల్లి తాళికట్టిన పెళ్ళాం అవుతాడా.. పడకగదిలో ఉన్న పెళ్ళాం తల్లి అవుతదా చెప్పండి.. ఏది ఏమైనా సినిమాల ప్రభావమో.. లేదంటే పరదేశి కల్చర్ కి అలవాటు పడడంతో గాని మన భారతీయ సమాజం మరి ఇంతలా తయారు అయింది.. కొంచం కళ్ళు తెరవాలి.. మహిళలపై దాడులు గరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత..