సినిమా ఛాన్స్ పేరుతో.. లైంగిక దాడులు.. ఎక్కడో తెలుసా..
posted on Jul 8, 2021 @ 12:25PM
సినిమా అదొకమాయ ప్రపంచం. వెండితెర మీద కనిపించాలని ఎవరనుకోరు చెప్పండి.. ఇప్పటికి చాలా వేల మంది అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు.. సినిమా గురించి ఎంత నెగిటివ్ టాక్ ఉన్న ఆ వెండితెరకు ఉన్న క్రేజే వేరు.. ఇక కొంత మంది లైఫ్ లో చేసేది ఏమి లేక సినిమా పేరుతో అడ్డమైన పనులు చేస్తుంటారు. అందులో భాగంగానే అవకాశాలు ఇపిస్తాం అని డబ్బు అడగడం ఒక ఎత్తు ఐతే అవకాశాలు ఇప్పిస్తాం అని అమ్మాయిలను వాడుకోవడం వారిని మానాలను దోచుకోవడం మరో ఎత్తు అని చెప్పాలి.. ఎవరు అన్న అనుకున్న కొంతమంది మాత్రం ఈ సూత్రాన్ని ఇప్పటికి వాడుతున్నారు.. ఏమి తెలియని కొంతమంది అమాయక ప్రజలు ఇప్పటికి వీళ్ళ చేతిలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా సినిమా లో అవకాశం ఇప్పిస్తాను అని చెప్పి ఒక అమ్మాయిని లైంగికంగా దాడి చేశాడు..
సినిమా పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్న ఓ కీచకుడి బాగోతం గుట్టురట్టైంది. కొత్త సినిమాలో అవకాశాలు ఇస్తానంటూ యువతులను నమ్మించి లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తాను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్‌నని ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ తీయబోతున్నట్లు ప్రచారం చేశాడు. తన షార్ట్ ఫిల్మ్స్‌లో నటించేందుకు నటీమణులు కావాలని ప్రచారం చేశాడు. ఇందులో భాగంగా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాలమ్మ మహత్యం మూవీ క్రియేషన్స్ పేరిట కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. అక్కడికి వచ్చిన అందరిని బురిడీ కొట్టించాడు. తన మాటల గారడితో అందరిని నమ్మించే వాడు సినిమాల్లో నటించాలనే ఆశతో కొందరు యువతులు ప్రవీణ్‌కుమార్‌ను ఆశ్రయించారు. దీంతో వారి ఆశను ఆసరాగా చేసుకుని వారిపై కన్నేసి ఆ తర్వాత కాలు వేయాలని ఎలాగైనా వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. అయితే ఇటీవలే ఓ యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆ యువతి అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆరా తియ్యగా అసలుు విషయం చెప్పి బోరున విలపించింది. దీంతో బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్, చిత్ర యూనిట్ సభ్యులు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.