ఇరికిస్తే కోడెల... దొరికిపోతే జగన్!
posted on Jun 17, 2024 @ 1:58PM
వెనకటికి ఒకడు విపరీతంగా దొంగతనాలు చేసేవాడు. విలాసంగా దర్జాగా బతికేవాడు. తన తెలివి తేటలతో డబ్బులు సంపాదించేస్తున్నాడు అనుకుని అతన్ని ఆ ఊరి జనం దొరదొరా అని సంభోధించడం ప్రారంభించారు. దొంగతనాలు చేసి దర్జాగా బ్రతుకున్న విషయం ఓ స్నేహితుడికి తెలియగంతో అతన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. వొరేయ్ నువ్వు దొంగతనం చేస్తున్నావని ఊరి జనానికి తెలిస్తే నీకు అవమానం కాదా అని ప్రశ్నించాడు. ఇందుకు ఆ దొంగ సమాధానం నేను దొరికితే కదా అప్పటి వరకు దొరగానే చెలామణి అవుతాను అని జవాబిచ్చాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితి కూడా ఆ దొంగ పరిస్థితే ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నీచర్‌ను అక్రమంగా తన ఇంట్లో ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎక్కువగా తన క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన చేసేవారు. సెక్రటేరియట్ కు కేవలం మంత్రి వర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవారు. తాడేపల్లిలోని తన ఇంటి పక్కనే మరో భవనం నిర్మించారు. దాన్నే క్యాంప్ ఆఫీసుగా చెబుతున్నారు. సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా జీవోలు విడుదల చేసి ఆ ఇంటికి అదనపు సౌకర్యాలు, ఫర్నీచర్ కల్పించారు. అంతా ప్రజాధనంతోనే ఈ సౌకర్యాన్ని కల్పించారు. ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన పన్నులు పూర్తిగా ప్రజాధనం అవుతుంది. ఆ ప్రజాధనం మీద జగన్ కన్ను పడింది. ఐదేళ్ల నుంచి దోచుకున్న ప్రజాధనంతో తన ఇంటికి అవసరానికి మించి ఫర్నిచర్ వాడుకున్నాడు. ఎపి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది. తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీద ఉన్నమమకారం తగ్గించుకోని జగన్ తన ఇంట్లో అట్టే పెట్టేసుకున్నాడు. . ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎంగా రాజీనామా చేసినప్పటికీ ఫర్నిచర్ను మాత్రం అప్పగించలేదు. ప్రస్తుతం ఇదే అంశం వివాదాస్పదమైంది. ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించిన భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రకటించారు. ఆ పార్టీ కార్యాలయంలోనే జగన్ తన పార్టీ సమీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీలతో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశం వైరల్ అయింది. దీనికి కారణం ఎప్పుడూ అధికారిక సమీక్షలు, రివ్యూలు, బటన్లు నొక్కే కార్యక్రమాలు నిర్వహించే చాంబర్ లోనే ఆయన సమావేశం పెట్టారు. ఇప్పటి వరకూ అది సెక్రటేరియట్ అనుకున్నాం కానీ జగన్ ఇల్లా అని ఆశ్చర్యపోతున్నాయి టీడీపీ శ్రేణులు. జగన్ వాడుకున్న ఫర్నిచర్ ను గత ఐదేళ్లుగా చూసిన వారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే ఫర్నిచర్ ను వాడటాన్ని సహించలేకపోతున్నారు. న్యూటన్ థర్డ్ లా ను మననం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వెల్ అండ్ అండ్ అపోజిట్ రియాక్షన్ అనేది ప్రపంచప్రఖ్యాత తత్వవేత్త న్యూటన్ థర్డ్ లా చెబుతుంది. 80 వ దశకంలో పల్నాడు ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్ ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లో వచ్చారు. హోంమంత్రిగా, సుదీర్ఘకాలం శాసనసభా స్పీకర్ గా పని చేసిన అనుభవం ఉంది. పదవీకాంక్ష లేకుండా ప్రజల మేలు కోసమే తన జీవితం చివరి క్షణాల్లో పోరాడిన కోడెల శివ ప్రసాద్ పై ఫర్నిచర్ దొంగ కోడెల అని జగన్ ప్రచారం చేసాడు. తన భజన బృందంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయించాడు. పల్నాడు ప్రాంతంలో కోడెలకు ఉన్న ఇమేజిని దెబ్బతీసే విధంగా వ్యవహరించాడు.
గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి రాగానే జగన్ తన మార్కు రాజకీయం చేశాడు. మాజీ స్పీకర్ హోదాలో కోడెల జగన్ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.. తన స్పీకర్ కార్యాలయం కు సమీపంలోనే ఉన్న గెస్ట్ హౌజ్ ఉండేది. ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ కొంత తన వద్దే ఉండిపోయిందని వెంటనే ఈ ఫర్నిచర్ ను తీసుకెళ్లాలని మొదట కోడెల అర్జీ పెట్టుకున్నారు. స్పందన రాకపోయే సరికి కోడెల రెండో సారి అర్జీ పెట్టుకున్నారు. ఈ రెండు లెటర్లను జగన్ ప్రభుత్వం దాచేసి కోడెల దోచేశాడని ప్రచారం చేశారు. . కోడెల ఫర్నిచర్ దొంగ అని జగన్ తందాన బ్యాచ్ ప్రచారం చేసింది. దీంతో కోడెల తీవ్ర మనస్థాపం చెంది తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందే వారు. . డిప్రెషన్ కు లోనైన కోడెల చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోడెల జగన్ చేసే బ్యాడ్ ప్రొపగండకు బలయ్యారు. అబద్దాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్దం చేయడంలో జగన్ సిద్ద హస్తుడు. కోడెల ఆత్మహత్యకు పురిగొల్పిన జగన్ ఇప్పుడేమో నీతి వచనాలు పలుకుతున్నాడు.టిడిపి శ్రేణులు జగన్ ద్వంద వైఖరిని తట్టుకోలేకపోతున్నాయి. అధికారం కోల్పోయి ఇన్ని రోజులైనా జగన్ తన ఫర్నిచర్ విషయాన్ని గోప్యంగానే ఉంచాడు. కోడెల రెండు లెటర్లు రాస్తే జగన్ ఒక్క లెటర్ కూడా ఇవ్వకుండా తన వద్ద ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ కొనేస్తానని బేరం పెట్టాడు. అదే కోడెల విషయంలో రెండు నాల్కల వైఖరి అవలంబించాడు.
రెండు లక్షల విలువ చేయని ఫర్నిచర్ కోడెల వద్ద ఉన్నప్పుడు జగన్ రాచిరంపాన పెట్టాడు. పైగా కోడెల ఆత్మహత్యకు కారకుడయ్యాడు జగన్ . ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శల దాడి చేశారు.జగన్‌కు చెందిన ప్రైవేటు ఆస్తికి ఆయన సీఎం అయిన మొదటి ఐదు నెలల్లోనే రూ. 15 కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు రిలీజ్ చేసుకున్నారని జీవోలతో సహా కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటిని జగన్ వద్ద నుంచి రికవరీ చేయాలని అంటున్నారు.
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌ని వేధించిన కర్మఫలం జగన్ రెడ్డిని వెంటాడుతోందని వ్యాఖ్యానించారు.కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణమని, ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? అని జగన్‌ని ఆయన ప్రశ్నించారు. ‘‘దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం.. రేటు కడతాం.. అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఒప్పు అవుతుందా? ఫర్నిచర్‌కు కక్కుర్తి పడ్డ వాళ్లు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో అర్థమవుతుంది’’ అని ఉమ విమర్శించారు. నవ్వుతారని కూడా లేకుండా జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా? నాటి మంత్రివర్గ సభ్యులు చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. తనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.