టీట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్.. సెమీస్ లో ఇంగ్లాండ్ పై విక్టరీ
posted on Nov 10, 2021 @ 9:36PM
టీట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది న్యూజీలాండ్. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి పైనల్ లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ విధించిన 167 పరుగుల విజయ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. న్యూజిలాండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కూడా త్వరగానే పోయింది. మూడో వికెట్ కు మిచెల్, కాన్వే మంచి భాగస్వామ్యం అందించారు. అయితే 15 ఓవర్ లో 46 పరుగులు చేసిన కాన్వే స్టంప్ అవుట్ గా అవుటయ్యాడు. తర్వాత నాలుగో వికెట్ కూడా వెంటనే పడింది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టార్గెట్ రన్ రేట్ పెరిగిపోయింది. అయితే 17 ఓవర్ లో నీషమ్ రెండు సిక్సర్లు,ఫోర్ కొట్టడంతో మ్యాచ్ మళ్లీ కివీస్ చేతుల్లోకి వచ్చింది. 18 ఓవర్ లో మరో సిక్సర్ బాదాడు నీషమ్. తర్వాత మిచెల్ కూడా సిక్సర్ కొట్టి ఫస్ట్ టీట్వంటీ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. తర్వాత నీషమ్ అవుట్ కావడంతో మ్యాచ్ మళ్లీ రసపట్టులోకి వచ్చింది. 19 ఓవర్ లో మిచెల్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో కివీస్ విజయం ఈజీగా మారింది. మిచెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
గ్రూప్ 1 లో టాప్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు... గ్రూప్ 2లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన న్యూజీలాండ్ తో తలపడింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ఇంగ్లండ్‌తో బ్యాటింగ్ చేయించాలని నిర్ణయించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. మొయిన్ అలీ (51; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మలన్ (41; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. జోస్ బట్లర్ (29) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, నీషమ్, టిమ్ సౌథీ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో శుభారంభం అందించారు. తొలి మూడు ఓవర్లలో నెమ్మదిగా ఆడినా తర్వాత జోరు పెంచారు. ట్రెంట్ బౌల్ట్ నాలుగో ఓవర్‌లో బట్లర్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఐదు ఓవర్లకు స్కోరు 37/0గా నమోదైంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. మిల్నే వేసిన ఆరో ఓవర్‌లో జానీ బెయిర్ స్టో (13) విలియమ్సన్‌కి చిక్కాడు. తర్వాత స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. ఇష్ సోధీ వేసిన తొమ్మిదో ఓవర్‌లో జోస్ బట్లర్ (29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత డేవిడ్ మలన్ జోరు పెంచాడు. ధాటిగా ఆడుతున్న మలన్‌ని సౌథీ వెనక్కి పంపాడు. తర్వాత మొయిన్ అలీ దూకుడుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాడు.