అమ్మకానికి ఇంజనీరింగ్ కాలేజీలు
posted on Oct 15, 2012 @ 10:25AM
మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. కాలేజీలకు అనుమతికావాలన్నా, రద్దుకావాలన్నా ఎఐసిటి ని సంప్రదించవలసిందే. ప్రస్తుతానికి 10 కాలేజీలు ఈసంస్ధను అనుమతి రద్దు చేయాలంటూ కోరాయి. త్వరలో ఇది 50 కాలేజీలకు పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కాలేజీల పరిస్ధితి అలాగే వుందని, సిక్స్ పే అమలు చేస్తామన్న కాలేజీలు, ఫిఫ్త్ పే అమలు చేస్తున్న కాలేజీలు, 35 వేలకు ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న కాలేజీలుకూడా ఆర్ధికంగా నష్టాలలో నడుస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం తమను టాస్క్ ఫోర్స్ ల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆరోపణలు మరొక విధంగా ఉన్నాయి. కేవలం వ్యాపార పంధాలో కాలేజీలు నిర్వహించడం వల్ల ఇలా జరుగుతుందని, అరకొర సౌకర్యాలతో, నైపుణ్యంలేని అధ్యాపకులతో కేవలం సర్టిఫికేట్లు జారీ చేసే కార్యాలయాలుగా ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు పనిచేస్తున్నాయని వారు అంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలో యాజమాన్యాలు ఇంతగా నష్టపోటానికి కారణం ప్రభుత్వ మేనని జూన్ మొదటివారంలో నిర్వహించవలసిన అఢ్మిషన్లను సెప్టెంబర్ లో జర పటం వల్ల దాదాపు 50,000 మంది విద్యార్దులు మిగతా రాష్ట్రాలకు తరలిపోయారని కళాశాల యాజమాన్యులు చెబుతున్నాయి. అంతేకాక విద్యాసంవత్సరంలో జరిగిన జాప్యానికి కానూ విదేశీ విద్యార్ధులు కూడా వేరే రాష్ట్రాలకు తరలి పోయారని వారు తెలిపారు. అయిన అన్ని రాష్ట్రాలకన్నా తక్కువ ఫీజుకు మంచి విద్యను అందిస్తున్నామన్నారు. బెంగాల్లో 9 కోట్లమంది జనాభావుండగ 14 వేలమంది మాత్రమే ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారని, మనరాష్ట్ర జనాభా 8 కోట్లమంది ఉండగా ఆలస్యంగా మొదలైన ఈ విద్యాసంవత్సరంలో కూడా 1,75,000 మంది ఇంజనీరింగ్ లో చేరారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అలాగే యంబిఎ, యంసిఎ కాలేజీలు కూడా ఇదే బాటలో ఉన్నాయని వారు చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలు మార్కెట్లో పెట్టి వేల మందికి ఉపాధి కల్పించామన్న యాజమాన్యాలు ఈ పరిస్దితికి కారణం ప్రభుత్వమేనంటున్నారు. ఏది ఏమైనా కారు చౌకకు కాలేజీలు అమ్మబడును అనేది మాత్రం నిజం.