జార్ఖండ్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి
posted on Apr 4, 2023 @ 11:00AM
జార్ఖండ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోలు హతమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. పలాము- ఛాత్రా జిల్లాల్లోని సరిహద్దులో నక్సల్స్ దాగి ఉన్నారన్న సమాచారంతో ఝార్ఖండ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్సు (సీఆర్‌పీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన కూంబింగ్ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోల మృతదేహాలతోపాటు, పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. మృతుల్లో రూ. 25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ ఉన్నట్టు చెబుతున్నారు.
మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. గాయపడి తప్పించుకున్న మావోల కోసం విస్తృత గాలింపు చేపట్టారు. అలాగే నక్సలైట్లకు సహాయపడిన వారి కోసం కూడా కూంబింగ్ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో రెండు ఏకే-47 రైఫిళ్లను కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా పోలీసు చర్యల కారణంగా జార్ఖండ్ లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని చెబుతున్నారు. నక్సల్ సమస్యను పూర్తిగా అరికట్డడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.