Read more!

తెలుగుదేశం కూటమి ఫిర్యాదులు బుట్టదాఖలేనా? ఎన్నికల సంఘం మౌనం సంకేతమదేనా?

కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా?  లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా?  ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.

సీఎస్-డీజీపీలను బదిలీ విషయంలో ఈసీ కిమ్మనకపోవడం?  చివరాఖరికి ఇన్ చార్జి డీజీపీ ఆధ్వ ర్యంలో  ఎన్నికలు జరగడం విధాయకం కాకపోయినా పట్టించుకోకపోవడం చూస్తుంటే.. వారి బదిలీ విషయం అటకెక్కనట్లేకనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ డిజీపీ విషయంలో ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అలా మార్చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే  గత ఎన్నికల ముందు అప్పటికి ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు ఇచ్చిన మరుసటిరోజే  ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు.  అలాగే అప్పటి విపక్షం ఫిర్యాదుపై ఆఘమేఘాలపై స్పందించి అప్పటి సీఎస్ పునేఠాను బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే ఎన్నికల సంఘం ఇప్పుడు విపక్షంలో ఉన్న తెలుగుదేశం, ఆ పార్టీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ఫిర్యాదులిచ్చి నెలరోజులవుతున్నా, పోలింగ్ సమయం రోజుల వ్యవధిలోకి వచ్చేసినా  ఎందుకు స్పందించడం లేదని  ప్రశ్నిస్తున్నారు.

ఇక సామాన్య జనంలో అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పట్టించుకోకుండా అధిష్ఠానం ఇంకా వైసీపీ తోనే అంటకాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   గత ఎన్నికల ముందు బీజేపీతో విబేధించిన తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే విధంగా వాయువేగంతో చర్యలు తీసుకున్న ఇదే ఎన్నికల సంఘం ఇప్పుడు  డీపీ-జనసేన ఎన్డీయే కూటమి ఉన్నా, తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు సీఎస్, ఇన్ చార్జి డీజీపీల బదిలీ విషయంలో ఎందుకు స్పందించడం లేదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని తప్పించాలని స్వయంగా, కూటమిలో పెద్దపార్టీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు పురందేశ్వరి ఫిర్యాదుచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి కూడా ఫిర్యాదుచేశారు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలే ఫిర్యాదుచేసినందున, ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను నిలిపివేసి, ఆయనను బదిలీ చేస్తారని అంతా భావించారు.

అయితే ఆశ్చర్యకరంగా ధర్మారెడ్డి డెప్యూటేషన్ ను కొనసాగించాలంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ లేఖను కేంద్రంలోని బీజేపీ సర్కార్  ఆమోదించింది.  సొంత పార్టీ అధ్యక్షురాలి ఫిర్యాదులను పట్టిం చుకోకుండా బీజేపీ జగన్ వినతికి తలూపడం బీజేపీ, వైసీపీ బంధం కొనసాగుతోందా అన్న అను మానాలకు బలం చేకూర్చేలా ఉంది..