ఆస్పత్రిలో తల్లి.. ఈడీ విచారణలో రాహుల్.. నిరసనలతో హోరెత్తించిన కాంగ్రెస్
posted on Jun 13, 2022 @ 5:51PM
అన్నా చెల్లీ అనుబంధం జన్మజన్మలా బంధం.. అంటూ సినిమా పాట వింటూ భావోద్వేగానికి గురయ్యే వారు చాలామందే వుంటారు. ఆర్ధిక సమస్యల్లోనో, కోర్టు కేసుల్లోనో పీకల్లోతు వున్న అన్న కోసం పరుగున వెళ్లి చేదోడు వాదోడుగా నిలిచే చెల్లి వుంటుందా? అంటే వుంటుంది. అదీ ప్రియాంకా గాంధీ వాద్రా రూపం లో! నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ. డి) పిలిచింది.
బీజేపే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రె స్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ‘నేరం చేసిన వారు ఎవరైనా నేరం చేశామని అంగీకరిస్తారా? అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తల్లీ కొడుకులు నేరం చేయలేదనేది నిజం అయితే ఆ ఇద్దరూ విచారణకు హాజరై, తమ నిజాయతీని నిరూపించుకోవాలని నడ్డా కాంగ్రెస్ నేత లకు సవాలు విసిరారు. పోతే, కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆమె కోవిడ్ అనంతర అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. సోమవారం రాహు ల్ గాంధీని విచారణకు ఇ.డి. పిలిచింది. ఇది చాలా దారుణమని, కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ అధినేత పై కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా సమన్లు జారీచేయిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహించి దేశవ్యాప్తంగా ఆందోళనలకు నిర్ణయించింది. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో సోమవారం సత్యా గ్రహ్ పేరుతో ఆం దోళన చేపట్టారు. భారీ ర్యాలీకి నిర్ణయించారు.
పార్టీవారికి వుండే అభిమానం, ప్రేమ పోలీసులకు వుండాలని రూలేం లేదు. పార్టీ కార్యాలయం వద్ద అను చరులు, వీరాభిమానులు, కార్యకర్తలు రాహుల్ జిందాబాద్ అంటూ భారీ నినాదాలు చేసేరు. అందరూ పెద్ద ఎత్తున ర్యాలీ తీయబోయారు. కానీ అసలు ర్యాలీ తీయడానికి, ఇలా భారీ ఎత్తున జనం వెంటబడి రావడానికి అస్సలు అనుమతే లేదు, వెనక్కి వెళ్లమన్నారు. కానీ పార్టీ వీరాభిమానులు వూరుకుంటారా? మా నాయ కుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ స్థాయి పాలోయింగ్ వుండాలన్నా .. అంటూ గొడవకి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయం దగ్గర, ఇ.డి. కార్యాలయం దగ్గరా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాం గ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసేరు. అయినా సరే రాహుల్ గాంధీ వెంట ఎవరికీ అను మతించేది లేదని ఖరాఖండీగా చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన నిరసన కార్య్రక్రమంలో జైరామ్ రమేష్, అధిర్ రంజన్ చౌదరీ, దీపేందర్ హుడా వంటి నాయకులు కూడా పాల్గొన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. దీంతో ప్రియాంక తెగ బాదపడిపోయింది. సోదరుడి వెంట వెళ్లాలనుకుంది. కానీ అదే మన్నా బడిలో చేర్చడానికి వెళ్లడమా?! దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెల కొనడంతో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్య కర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేష న్‌కి చాలామందిని తరలించారు. పార్టీ కార్య కర్తలను అనవసరంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహించారు ప్రియాంకా గాంధీ. కార్యకర్త లకు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని ఆమె భరోసా ఇచ్చి వెనుదిరిగారు.
అప్పటిదాకా ర్యాలీలో పాదయాత్రలో వున్న రాహుల్ ని ఇ.డి. అధికారులు తమ వాహనంలో తమ కార్యాల యానికి తీసికెళ్లారు. ఆఫీసు చేరగానే అధికారులు విచారణ ఆరంభించేరు. ఈ విచారణ మధ్యాన్నం భోజన సమయానికి వూహించని సంఘటన చోటుచేసుకుంది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమంటే, సాధారణంగా విచారణ సమయంలో అధికారులే లంచ్ ఏర్పాటు చేస్తారు. కానీ చిత్రమేమంటే రాహుల్ ను మాత్రం స్కూల్ లంచ్ అవర్‌లో బయటికి అనుమించారు. అంతకంటే చిత్రమేమంటే, లంచ్ తర్వాత తన తల్లి సోనియాగాంధీ ఆరోగ్య విషయం తెలుసుకోవడానికి ఆస్ప త్రికీ వెళ్లిరావడం! ఇది ఇ.డి విచారణల చరిత్రలో కనీవినీ జరగనిది. సాధారణంగా ఇ.డి విచారణ గంటల పాటు కొనసాగుతుందే గాని మధ్యలో ఇలా విశ్రాంతి ఇవ్వడం అనేది జరుగదు. మరి రాహుల్ గాంధీ విషయంలో ఇంత విరామాన్ని, స్వేచ్ఛనీ ఇ.డి కల్పించడం వెనుక ఆయన్ను అరెస్టు చేయడానికి జరుగుతున్న సన్నాహాలేనని అనుకోవాలా? చూడాలి.