ములాయంసింగ్ ఓటును చెల్లదంటున్న ఈసీ ...
posted on Jul 20, 2012 @ 3:54PM
నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఓటును ఈసీ చెల్లదంటూ చెప్పింది. దీనికి కారణం ఏమిటని వివరణ కోరగా ముందు ములాయం సింగ్ పొరపాటున ఎన్.డి.ఎ. ప్రభుత్వం బలపరిచిన సంగ్మాకు ఓటు వేశారు. తరువాత తన తప్పు తెలుసుకుని తిరిగి యూ.పి.ఎ. బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి బ్యాలెట్ పేపర్ పై మార్క్ చేశారు. దీన్ని ఈసీ ఈ ఓటు చెల్లదంటూ తేల్చి చెప్పింది.