స్కూల్ బస్సు బోల్తా, పిల్లలకు తీవ్రగాయాలు
posted on Aug 30, 2012 @ 6:19PM
పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో స్కూల్ బస్సు బోల్తాపడి పదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థుల్ని వెంటనే ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బోల్తాపడ్డ బస్సు కొద్దిలో మరో పెద్ద ప్రమాదం నుంచి బైటపడింది. బస్సు ఎడమపక్కనున్న కాలవలో పడుంటే అందులోఉన్న పిల్లలంతా ప్రాణాలు పోగొట్టుకునేవాళ్లు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్ధుల్లో
ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా బస్సుని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.