ముందస్తు మాన్ సూన్.. రైతులకు చల్లటి కబురు
posted on Apr 12, 2024 8:59AM
ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్ మెట్ రైతులకు చల్లటి కబురు అందించింది. ఈ ఏడాదది ముందస్తు రుతుపవనాలు ఖాయమని, అలాగే వర్షపాతం కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందనీ పేర్కొంది. వర్షాభావ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఇది నిజంగానే చల్లటి కబురు. సాగుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ముందస్తు రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు అన్న వార్తతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో దేశమంతా కరువు పరిస్థితులు దాపరించాయి.
కొన్ని చోట్ల నోటికాడికి వచ్చిన పంటలు నీటి ఎద్దడితో ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఈ సారి ముందుగానే రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వారిలో ఆనందం నింపింది.
వ్యవసాయాధారిత దేశమైన ఇండియాలో మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆదారపడి జీవిస్తున్నారు. పంటలు బాగా పండాలంటే సాగు నీరు ప్రధానం. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిపోయి రైతులు కుదేలయ్యారు. అయితే ఈ ఏడాది లానినోపరిస్థితుల కారణంగా రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే నిప్పులు చెరుగుతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా భానుడి భుగభగలతో ఎండలు తీవ్రాతి తీవ్రంగా ఉన్నాయి. ఈ కారణంగా పలు ప్రాంతాలలో నీటి ఎద్దడి తీవ్రమైంది. బెంగళూరు వంటి నగరాలలో అయితే నీటి సంక్షోభమే తలెత్తింది.
ఇలాంటి పరిస్థితుల్లో వ ఈ సారైనా వర్షాలు పడతాయో లేదో అని ఆందోళన చెందుతున్న ప్రజలకు ముందస్తు రుతుపవనాల వార్త తొలకరి జల్లులా వినిపించింది. ఈ ఏడాది జూన్-ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు ఏర్పడి ముందుగానే రుతుపవనాలు వస్తాయని.. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, సాధారణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.