ఎంసెట్ ఫలితాలు: టాపర్లు వీరే
posted on Jun 9, 2014 @ 7:05PM
ఎంసెట్-2014 పరీక్షా ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఎంసెట్ పరీక్షల్లో 70.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 76.2 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 67.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ మెడికల్ పరీక్షల్లో మొత్తం 83.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 84.75 శాతం ఉత్తీర్ణత, బాలురు 80.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను విద్యార్థులు సంక్షిప్త సందేశాల ద్వారా పొందవచ్చని జగదీష్ రెడ్డి తెలిపారు.
ఇంజనీరింగ్ టాపర్స్ ...
1. పవన్‌కుమార్ 99.02 158 (హైదరాబాద్)
2. చాణిక్య వర్ధన్‌రెడ్డి 88.59, 157 (హైదరాబాద్)
3. నిఖిల్ కుమార్, 98.43, 157 (రంగారెడ్డి)
4. దివాకర్ రెడ్డి 98.30, 157(కృష్ణా)
5. ఆదిత్య వర్ధన్ 97.66, 155 (విజయనగరం)
6. ప్రేమ్ అదనవ్ 97.53,155 (హైదరాబాద్)
7. అక్షయ్‌కుమార్, 97.41, 155 (మహబూబ్‌నగర్)
8. సాయికశ్వప్, 97.24,155 (నల్గొండ)
9. ర్యాంక్ బాల సాయిసూర్యప్రహర్ష, 97.19, 154 (రాజమండ్రి, తూగో)
10. ర్యాంక్ చింతపూడి సాయిచేతన్, 97.15, 154 (హైదరాబాద్)
మెడిసిన్ టాపర్స్ ...
1. గుర్రం సాయిశ్రీనివాస్, 99.45, 159 (ప్రకాశం)
2. బి.దివ్య, 99.45,159 (నెల్లూరు)
3. కందిగొండ పృద్వీరాజ్, 99.24, 159 (హైదరాబాద్)
4. హరిత, 99.02, 158 (గుంటూరు)
5. గీతారెడ్డి99.02, 158(విజయవాడ)
6. బి భరత్‌కుమార్, 99.02,158(ఖమ్మం)
7. శ్రీవిద్య, 98.98,158(విశాఖ)
8. సాత్విక్ గంగిరెడ్డి, 98.98,158(హైదరాబాద్)
9. సాయిహర్షతేజ, 98.90, 158(ఖమ్మం)
10. గంట సాయినిఖిల, 98.8, 158(గుంటూరు, తెనాలి)