12 ఏళ్ళ బాలికపై.. డ్రైవర్ దారుణం..
posted on Jun 8, 2021 9:13AM
మారాడు లోకం.. మారాదు కాలం... ఎవ్వరు ఏమైంపోని ఆ దేవుడు దిగిరాని.. మారదు లోకం.. మారదు కాలం. అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం.. యుగయుగాల కన్నా మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం.. రాముడిలా ఎదగలం రాక్షసులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం.. అని అంటాడు ఒక కవి. మనిషిలో రోజురోజుకి క్రూరత్వం పెరిగిపోతుంది. తాజాగా ఒక డ్రైవర్. పెళ్లి కి హాజరైన 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాలుపడ్డాడు కామాంధుడు. వివరాల్లోకి వెళితే..
ఓపెన్ చేస్తే.. అది శ్రీకాకుళం జిల్లా. జలుమూరు మండలం. గుగ్గిలి పంచాయతీ పరిధిలోని గుండువలస. అతని పేరు కె సింహాచలం. వయసు 28 సంవత్సరాలు. వృత్తి డ్రైవర్. శనివారం రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అందరు పెళ్లి పనుల్లో ఉన్నారు. పెళ్లి వేడుక అంటే అందరికి చూడాలని ఉంటుందని.. స్థానికులతో పాటు బాలిక (12) కూడా పెళ్లి వేడుక చూడడానికి అక్కడికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన కె.సింహాచలం ఆ బాలిక పై కన్నేశాడు. ఆ తర్వాత పధకం వేశాడు.. మెల్లిగా మాయమాటల్లికి దించాడు.. పెళ్లి వేడుక నుంచి బయటకు తీసుకెళ్లాడు. స్థానికంగా ఓ ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు.. అక్కడికి వెళ్లాగానే ఆమె నోరునొక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.
కట్ చేస్తే.. అప్పటి వరకు తమతో ఉన్న కూతురు కనిపించక పోవడంతో. ఆందోళన పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా పాప ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని వారు ఆరా తీశారు. ఆ బాలిక జరిగింది తతంగం మొత్తం చెప్పింది. బాలిక నుంచి రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వాసుదేవ్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు సింహాచలానికి వివాహమైంది. మనస్పర్థలతో అతడి భార్య రెండేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. ప్రస్తుతం అతడు ఓ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.