హుజూర్ నగర్ లో ఊహించిందే జరిగింది... కానీ అన్ని రౌండ్లలో ఆధిక్యంపైనే డౌట్స్...

 

హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. హుజూర్ నగర్ లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న సర్వే సంస్థల లెక్క తప్పలేదు. అంతేకాదు 18వేల నుంచి 25వేల వరకు మెజారిటీ కూడా రావొచ్చ అంచనా కూడా నిజమైంది. హుజూర్ నగర్ లో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏమాత్రం లేదని... కేసీఆర్ పరిపాలన, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల ప్రభావమే ఓటర్లపై ఆధికంగా ఉందన్న  సర్వే సంస్థల మాటలు అక్షరాలా నిజమని రుజువైంది. అయితే, మొదట్నుంచీ ఊహించినట్లుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు నడిచినప్పటికీ.... ఏ రౌండ్ లోనూ సైదిరెడ్డికి పద్మావతి పోటీ ఇవ్వలేకపోయింది. ప్రతి రౌండ్ లోనూ పద్మావతిపై సైదిరెడ్డి పైచేయి సాధించారు. దాంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ప్రతి రౌండులోనూ టీఆర్ఎస్ కు వేల ఓట్లు ఎలా ఆధిక్యం వస్తుందంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. 

ఇక, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటోన్న బీజేపీకి హుజూర్ నగర్ లో డిపాజిట్ కూడా దక్కలేదు. అలాగే, తెలుగుదేశం కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. హుజూర్ నగర్లో ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లంతు అయ్యింది.
 

Teluguone gnews banner