జీసస్ కాలింగ్.. వైఎస్సార్‌తో మీటింగ్.. జగన్ మెంటల్ కేసా?
posted on Jun 29, 2021 @ 3:45PM
దేవుడు కల్లో కనిపిస్తే అది భక్తి. చనిపోయిన వాళ్లు కల్లోకి వస్తే అది ప్రేమ. ఆ ఇద్దరూ ప్రతీరోజు అలారం పెట్టుకొని మరీ రాత్రి 12 గంటలకు బతికి ఉన్నవారితో మాట్లాడితే..? అది పిచ్చి.. అని వేరే చెప్పనవసరం లేదేమో. మానసిక ఆరోగ్యం బాగా దెబ్బ తిన్న వారికే అలా జరుగుతుంది. ఇంతకీ చనిపోయిన వాళ్లు కనిపిస్తే ఆత్మ అనాలా? దెయ్యం అనాలా? అనే డౌటూ మరోవైపు. ఇక దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంటే.. మతిభ్రమించిందని అనుకోవాలా? లేక, అపరిచితుడిగా భావించాలా? ఇలాంటి చేష్టలు, అలాంటి మాటలు.. బయట ఎవరైనా మాట్లాడితే.. వాడికి దెయ్యం పట్టిందిరా అని భూతవైద్యుడికి చూపిస్తారు. వేప మండలతో నాలుగు గట్టిగా తగిలిస్తే.. మరో నాలుగు చెప్పు దెబ్బలు వేస్తే.. దెబ్బకు పట్టిన దెయ్యం వదిలిపోతుంది. అంతేకానీ, తనతో దేవుడు మాట్లాడుతాడని కానీ, తనతో చనిపోయిన తన తండ్రి డైలీ మిడ్‌నైట్ డిస్కషన్స్ పెడతాడని గానీ బయట ఎవరైనా ఎవరితోనైనా చెబితే.. వాడికి పిచ్చిపట్టిందిరా బాబోయ్ అంటూ మళ్లీ అతనివైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడరు.
కానీ, ఏపీలో ప్రచారం జరుగుతున్నట్టు.. ఆ పిచ్చిపట్టిన లాంటి చేష్టలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే చేస్తే...? వామ్మో.. ఊహించుకోడానికే ఆదోలా ఉంది. కానీ, ఇది నిజమంటూ.. వైఎస్ జగన్.. ప్రతిరోజూ రాత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడతారంటూ.. ఈ విషయం సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. నమ్మదగ్గ సమాచారం ప్రచారంలో ఉంది. కేవలం వైఎస్సార్‌తోనే కాదు.. దేవుడి బిడ్డ అయిన జగన్.. జీసస్ తనతో మాట్లాడతాడని ముఖ్యమంత్రే చెప్పినట్టు అధికార వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు విషయాల గురించి ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థ అధినేత బయట పెట్టడంతో.. ఏపీ సీఎం జగన్‌కు అసలేమైంది..? ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందనే అనుమానం, చర్చ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఏపీలో ఇప్పుడు ఏ నలుగురు కలుసుకున్నా ఇదే చర్చ. నీకు తెలుసా.. జగన్‌తో వైఎస్సార్ రోజూ మాట్లాడతారట..! నీకు తెలుసా.. జీసస్ క్రైస్ట్ జగన్‌తో టచ్‌లో ఉంటారట.. అంటూ హాట్ హాట్ డిబేట్‌లు జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలోనైతే.. సెటైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయ్. ఆ మీడియాలో ఈ వార్త వచ్చినప్పటి నుంచి ఇటు ఏపీలో, అటు సోషల్ మీడియాలో.. జగన్‌పై జబర్దస్త్ కామెడీ ఫెస్టివల్ నడుస్తోంది. ఇన్నాళ్లూ కరోనాతో కష్టాలు, బాధలు మాత్రమే చూసిన జనాలు.. ఈ విషయం తెలిసి పొట్టపగిలేలా నవ్వుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత ఇంతటి కామెడీ ఎపిసోడ్ వింటున్నామని.. నవ్వాపుకోలేక పోతున్నామంటూ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ మీడియా అధినేత జగన్ గురించి ఏం చెప్పారంటే.....
ఇదీ మేటర్. 40ఇయర్స్ మీడియా ఇండస్ట్రీ పెద్దాయన ఇలాంటి వ్యాఖ్యలు ఊరికే చేయరు. ఇందులో నూటికి నూరు శాతం నిజం ఉండే ఉంటుంది. అందుకే, ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోనైతే జగన్‌ను కుమ్మేసుకుంటున్నారు. ఏంటి జగనన్న.. మీరు ఆ రాత్రి జీసస్‌తో మాట్లాడారా? అసలు వైరస్ లేదూ ఏమీ లేదు.. భయపడొద్దు అని జీసస్ మీతో చెప్పారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. మీరెంత కరుడుగట్టిన క్రిష్టియన్ అయినా.. ఏటేటా జెరుసలేం వెళ్లినా.. మరీ ఇంతగా పిచ్చి పీక్స్‌కు చేరడమేంటని అవాక్కవుతున్నారు. మీ జీసస్ కరోనా లేదని చెప్పారుగా.. మరి ఈ కేసులు ఏంటి? ఈ చావులేంటి? ఏపీలో ఈ కరోనా కల్లోలమేంటి? అంటే, మీ జీసస్ తప్పు చెప్పారా? లేక, మీరు అబద్దం చెప్పారా? లేక, జీసస్ మీతో చెప్పినట్టు మీరే భ్రమ పడ్డారా? ఇంతకీ మీ మెంటల్ కండీషన్ ఓకేనా..? అంటూ సోషల్ మీడియాలో జగన్‌ను ఏకిపారేస్తున్నారు. మరికొందరైతే, ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బాబ్బాబు.. మా ఇంట్లో కోడి కనిపించడం లేదు.. అది ఎక్కడికెళ్లిందో కాస్త జీసస్‌ను అడిగి చెప్పండి ప్లీజ్ అంటూ రకరకాల ఫన్నీ కామెంట్స్‌తో జగన్‌ను కుళ్లబొడుస్తున్నారు నెటిజన్స్.
ఇక ప్రతీరోజూ రాత్రి 12 గంటలకు దివంగత రాజశేఖర్‌రెడ్డితో చర్చిస్తానంటూ జగన్ చెప్పారనే వార్తపైనా నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ఈ రాత్రి వైఎస్సార్‌తో డిష్కస్ చేసేటప్పుడు.. మీ బాబాయ్, వైఎస్సార్ తమ్ముడు.. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో అడగాలంటూ కామెంట్లు చేస్తున్నారు. నాకు వైఎస్సార్ ఆసరా పథకం రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఆ వైఎస్సార్‌నే అడిగి చెప్పండంటూ ఇంకో సెటైర్. ఇలా.. మూడు రోజులుగా ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. కామెడీ రచ్చ.
గతంలో వైసీపీ ఎంపీ రఘురామ ఆరోపించినట్టు సీఎం జగన్ మెంటల్ కండిషన్ బాగానే ఉందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. ఇప్పటికే జగన్ మానసిక ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడంటూ కోర్టును సైతం ఆశ్రయించారు రఘురామ. జగన్ జీసస్‌తో, దివంగత వైఎస్సార్‌తో మాట్లాడుతారనే అంశానికి సాక్షం ఉంటే బాగుండేదని.. రఘురామకు బాగా ఉపయోగపడేదని అంటున్నారు. ఏదిఏమైనా.. ఆ దేవుడి దయ.. చల్లని చూపు.. ఆ మహానేత ఆశీస్సులతో.. ఆ మీడియా అధినేత బయటపెట్టిన ఈ రహస్యంతో జగన్ మానసిక వైఖరిపై ప్రజల్లో అనుమానంతో పాటు భయాందోళన కూడా వ్యక్తం అవుతోంది. వాడినలా వదిలేయకండ్రా.. వాడినెవరికన్నా చూపించండ్రా.. అంటూ సెటైర్లు పేలుతున్నాయి.